ork From Home: కరోనా కారణంగా ఉద్యోగాలన్నీ వర్క్ ఫ్రం హోమ్ అయ్యాయి. ముఖ్యంగా ఐటీ, సేవల రంగాలకు చెందిన ఉద్యోగులు గత రెండేళ్ల నుంచి ఇంటి నుంచే తమ
Work From Home: కరోనా కారణంగా ఉద్యోగాలన్నీ వర్క్ ఫ్రం హోమ్ అయ్యాయి. ముఖ్యంగా ఐటీ, సేవల రంగాలకు చెందిన ఉద్యోగులు గత రెండేళ్ల నుంచి ఇంటి నుంచే తమ ఉద్యోగాలను నిర్వహిస్తున్నారు. అయితే డిసెంబర్ లో మళ్లీ ఆఫీసులకు రావాలంటూ ఉద్యోగులకు పిలుపు వచ్చింది.
అయితే థర్డ్ వేవ్, ఓమిక్రాన్ భయాల వల్ల మళ్లీ ఉద్యోగులంతా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే దీర్ఘకాలం వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. రోజులో ఒకే ప్రదేశంలో కూర్చుని పనిచేస్తుంటారు ఉద్యోగులు. ఇలా చేస్తూనే ఏదో ఒకటి తింటూ ఉంటారు.
దీని వల్ల దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు వస్తాయని అంటున్నారు. గంటల తరబడి కంప్యూటర్ ముందు కోర్చోవడమే కాదు… శరీరానికి కాస్త వ్యాయామం అవసరమంటున్నారు.ఇలాగే పనిచేస్తే 20 ఏళ్లలో విపరీతంగా బరువు పెరిగిపోవడంతో పాటు ఉబకాయం, కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వంటి జబ్బులు వస్తాయి.
దీంతో పాటు రిపీటెట్ టైపింగ్ స్ట్రెస్, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. వెన్నెముక నొప్పితో పాటు మెడ నొప్పులు వస్తాయి. దీంతో పాటు చర్మం పొడిబారిపోతుంది.వీటన్నింటికి చెక్ పెట్టాలంటే వ్యాయామమే సరైన మార్గం అని నిపుణులు చెబుతున్నారు. వర్క్ ఫ్రం హోం చేస్తున్నవారు గంట – 2 గంటలకు ఓసారైనా పనిని పక్కన పెట్టి నడవాలంటున్నారు. దీంతో పాటు ఉదయం వ్యాయామం చేయాలని చెబుతున్నారు. రోజుకు కంప్యూటర్ పై 6-8 గంటల పనిని మాత్రమే చేయాలంటున్నారు. 7-9 గంటలు చక్కని నిద్ర అవసరమని చెబుతున్నారు. కుటుంబ సభ్యులతో గడపటం వల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…