Arjun sarja: యాక్షన్ కింగ్ అర్జున్ ఇటీవల తన పెద్ద కుమార్తె ఐశ్వర్య వివాహ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈయన తన పెద్ద కుమార్తె ఐశ్వర్యను కూడా తన వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇక ఇటీవల ఐశ్వర్య వివాహం తమిళ నటుడు తంబి రామయ్య కుమారుడు హీరో ఉమాపతితో జరిగింది.
వీరిద్దరిది ప్రేమ వివాహం అనే సంగతి మనకు తెలిసిందే. ఇక వీరి వివాహం చెన్నైలో అర్జున్ నిర్మించిన హనుమాన్ ఆలయంలో జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక అర్జున్ హీరోగా భారీ స్థాయిలో ఆస్తుల సంపాదించారు. ఈ క్రమంలోనే తన కుమార్తె ఐశ్వర్యకు ఎంత మొత్తంలో కట్నం ఇచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక ఈయనకు బెంగళూరులో మాత్రమే కాకుండా చెన్నైలో కూడా భారీ స్థాయిలో ఆస్తిపాస్తులు ఉన్నాయట. ఇక ఈయనకు కొడుకులు లేరు ఇద్దరు కుమార్తెలు కావడంతో ఆయన సంపాదించిన ఆస్తులలో ఒక వాటా తన పెద్ద కుమార్తెకు రాసిచ్చారని తెలుస్తోంది. ఇక తన కుమార్తె పెళ్లిలో భాగంగా సుమారు 150 కోట్ల విలువ చేసే బహుమతులు ఖరీదైన బంగ్లాలను కూడా ఇచ్చారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఖరీదైన బంగ్లాలు..
ఇలా అర్జున్ కుమార్తె కోసం ఇచ్చిన కట్నకానుకల గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక అర్జున్ కి కొడుకుల లేరు కనుక ఎప్పటికైనా తన ఆస్తిలో ఒక వాటా తన కుమార్తెకు వెళుతుందని తెలుస్తోంది. ఇక ఈమె ఇప్పటికే తమిళ కన్నడ సినిమాలలో నటించారు. తెలుగులో కూడా నటించాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…