YS Jagan Mohan Reddy: వైయస్ జగన్మోహన్ రెడ్డి 2024 అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిపాలు అయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికి కూడా జగన్ ఓటమిని ఎంతోమంది సామాన్య ప్రజలు అంగీకరించడం లేదు. ఏదో మోసం జరిగి ఉందని ఈవీఎం ట్యాంపరింగ్ చేసే కూటమి అధికారంలోకి వచ్చిందని లేకపోతే అంత మెజారిటీ రాదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికి సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరు ఈ విషయంపై అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. 151 సీట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికలలో 11 సీట్లకు పరిమితం అయ్యే అంత చెత్త పాలన చేయలేదని ఈయన రాష్ట్రానికి సంక్షేమ పథకాలను అందించడమే కాకుండా మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టారని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ఏక కంఠంతో చెబుతున్నారు.
ఇలా ఈవీఎంలను ట్రాప్ చేసి మరీ భారీ మెజారిటీతో గెలుపొందారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటివరకు ఈ విషయంపై ఎక్కడ స్పందించలేదు. తాజాగా ఈయన ఈవీఎంల గురించి చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది. ఈ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ తో ఓటింగ్ నిర్వహిస్తున్నాయని తెలిపారు.
బ్యాలెట్ తో ఓటింగ్..
ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలుబెట్టుకోవడానికి మనం కూడా ఆ దిశగా అడుగులు వేయాలని. జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ట్వీట్ పై చాలా మంది 2019 వ సంవత్సరంలో కూడా మీరు అలాగే గెలిచారా అంటూ కామెంట్ లు చేస్తున్నారు కానీ 2019 ఐదు సంవత్సరాల పాలనలో జగన్ పట్ల ఈ స్థాయిలో వ్యతిరేకత ఎక్కడ కనిపించలేదంటూ మరికొందరు జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…