AP: 2019 ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రతి 50 ఇళ్లకు ఒకరి వాలంటీర్ ను నియమించి ప్రజల వద్దకే పరిపాలనను తీసుకోవచ్చారు. అయితే వాలంటీర్ వ్యవస్థను గతంలో ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాయి.
ఇలా వాలంటీర్ వ్యవస్థ పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో మొదటికే మోసం వస్తుందని భావించిన ప్రతిపక్ష నేతలు వాలంటీర్ వ్యవస్థను తిరిగి కొనసాగిస్తామని తెలపడమే కాకుండా వారికి 10 వేల రూపాయల గౌరవ వేతనం అందిస్తామని తెలిపారు. ఇలా వాలంటీర్లకు కూటమి నేతలు ఆఫర్ ప్రకటించడమే కాకుండా ఈ ఎన్నికలలో కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో వాలంటీర్ వ్యవస్థ పై అయోమయ పరిస్థితిలు ఏర్పడ్డాయి.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో వాలంటీర్లుగా పని చేసిన వారిని నియమిస్తారా లేకుంటే కొత్త వారిని తీసుకుంటారా అనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు అయితే వాలంటీర్లు అందరూ కూడా గతంలో వైసీపీ నాయకులు బలవంతంగా మా చేత రాజీనామాలు చేయించారని తిరిగి మమ్మల్ని వాలంటీర్లుగా తీసుకోవాలని అధికారులపై స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
వారినే కొనసాగిస్తాం..
ఈ క్రమంలోనే రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ల గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతోమంది వాలంటీర్లు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని నాకు ఫోన్లు వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నారు. అయితే గతంలో ఎవరైతే రాజీనామా చేయలేదో వారిని తిరిగి కొనసాగిస్తామని, వచ్చేనెల వాలంటీర్ల చేత ప్రతి ఇంటికి పెన్షన్ అందజేస్తామని మంత్రి ప్రకటించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…