హృతిక్ రోషన్ పర్సనల్ ఏవిధంగా తయారైందో మనం చూస్తూనే ఉన్నాం.. అతని పచ్చని సంసారాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాడు హృతిక్ రోషన్.. అతని చిన్ననాటి స్నేహితురాలు సుసానే ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న హృతిక్ రోషన్ తన అఫైర్స్ కరంగమా ఆమెను దూరం చేసుకున్నాడు. నిజానికి కంగనా తో ఎఫైర్ ఇష్యూ నడుస్తున్న సమయంలో భర్తకు అండగా నిలిచింది ఆమె.. కానీ దాన్ని కాపాడుకోలేకపోయాడు హృతిక్ రోషన్.. పరస్పర అంగీకారంతో 2014లో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.
అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే విడాకుల తర్వాత కూడా ఫ్రెండ్స్‌గా కొనసాగడం వారి ప్రత్యేకత. తమ ఇద్దరు కొడుకులను జంటగానే చూసుకుంటూ వస్తున్నారు. పిల్లల విషయంలోనే కాకుండా ఒకరికొకరు సపోర్ట్‌గా కూడా ఉంటున్నారు. ఇకపోతే అయితే ఇన్నాళ్లకు సుసానే తన జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం నటుడు అలీ గోని సోదరుడు అర్‌స్లాన్ గోనితో ఆమె ప్రేమలో పడింది. ‘జియా ఔర్ జియా’ మూవీలో నటించిన అర్‌స్లాన్‌తో సుసానే సన్నిహితంగా మెలగుతోందని చెప్పుకుంటున్నారు.
ఏక్తా కపూర్ గ్యాంగ్‌తో కలిసి ఇటీవల సుసానే ఖాన్ విహార యాత్రకు వెళ్లడానికి కారణం ఏమిటో అందరికీ అర్థమైంది. అయితే తమ బంధంపై ఇటు సుసానే కానీ, అటు అర్‌స్లాన్ గోని కానీ పెదవి విప్పలేదు. ఇక హృతిక్ రోషన్ ప్రస్తుతం కొన్ని సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ప్రభాస్ తో ఓ మల్టీ స్టార సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…