వివాహేతన సంబంధాలు ఎంత దూరమైనా దారితీస్తాయి. దీంతో ఎన్నో కుటుంబాలు రోడ్డున కూడా పడ్డాయి. ఇలా రోజు ఏదో ఒక వార్తలు మనం వింటూనే ఉన్నాం. తాజాగా జరిగిన ఘటనలో కూడా వివాహేతర సంబంధం కాస్త.. ముగ్గురు ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పెనుబల్లి మండలం లంకపల్లి గ్రామానికి చెందిన బాలయ్య, కృష్ణవేణి దంపతులు. అదే గ్రామానికి చెందిన 30 ఏళ్ల ధర్మయ్య వారు ఉండే కాలనీలోనే ఉంటున్నాడు. దీంతో అతడితో పరిచయం ఏర్పరుచుకున్న సందరు మహిళ.. తరచూ మాట్లాడుతుండేది. ఇది రాను రాను వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఓ రోజు కృష్ణవేణి, ధర్మయ్య ఇంటి నుంచి పారిపోయారు.
దీంతో బాలయ్య తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. నిండు నూరేళ్లు కలిసి ఉంటానని చెప్పిన భార్య ఇలాంటి పని చేయడంతో ఎంతో క్రుంగిపోయాడు. తెల్లారి అతడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అది చూసిన చుట్టు పక్కల వారు అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తుండగా.. చికిత్స పొందుతూ అతడు మరణించాడు.
ఇంటి నుంచి పారిపోయిన సదరు మహిళ, ధర్మయ్యలు ఆ ఊర్లోనే ఓ ఇంట్లో ఉన్నారు. ఆ ఇంటి యజమాని.. కొన్ని రోజుల క్రితం వాళ్ల బిడ్డ ఇంటికి వెళ్లి.. తిరిగి వచ్చింది. తలుపులు తీయగా ఆ రెండు శవాలు వాసన వచ్చాయి. దీంతో ఆమె స్థానికులకు చెప్పగా.. వాళ్లిద్దరు ధర్మయ్య, కృష్ణవేణి గా గుర్తించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…