సాధారణంగా భార్యాభర్తల మధ్య ఎన్నో అనురాగాలు, ఆప్యాయతలు, కొట్లాటలు మనస్పర్ధలు రావడం సర్వసాధారణం. అయితే ఇవి కేవలం కొద్ది సమయం వరకు మాత్రమే ఉండి ఆ తర్వాత యధావిధిగా భార్య భర్తలు కలిసి మెలిసి అన్యోన్యంగా ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తే అవి ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయి. లేదా హత్యలకు దారితీస్తున్నాయి. ఇలాంటి హత్య హైదరాబాదులో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
చత్తీస్‌ఘడ్‌కు చెందిన అటల్ పార్థి, రేఖా పార్థి బతుకుతెరువు కోసం హైదరాబాద్ చేరుకొని జూబ్లీహిల్స్ రోడ్ నెం.5లోని దుర్గా భవానీనగర్‌ను ఆనుకొని ఉమెన్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఓ బిల్డర్ వద్ద వాచ్ మెన్ గతేడాది కాలంగా పని చేస్తున్నారు. అయితే వీరి మధ్య తరచూ గొడవలు తలెత్తుతూ ఉండేవి. ఈ సమయంలోనే ఇద్దరి మధ్య గొడవలు వచ్చినప్పటికీ కొంత సమయానికి తిరిగి సద్దుమణిగేవి.
ఈ విధంగానే గత రెండు రోజుల క్రితం ఈ భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో ఎంతో ఆవేశం చెందిన అటల్ పార్థి, తన భార్య రేఖా పార్థి పై గొడవకు దిగుతూ ఆమెను హత్య చేశాడు. ఇలా తన భార్యను హత్య చేసి తన శవాన్ని తాను వాచ్మెన్ గా పని చేస్తున్నటువంటి ఫ్లాట్ కాంపౌండ్ గోడ పక్కనే వరిగడ్డిలో చుట్టి అక్కడే పడేసి పరారయ్యాడు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని వెలికితీసి తమ బంధువులకు సమాచారం ఇచ్చారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్‌పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…