సాధారణంగా వర్షాకాలం మొదలవడంతో ఎన్నో రకాల సీజనల్ వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ఈ క్రమంలోనే డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాల బారిన పడుతుంటారు. డెంగ్యూ జ్వరంతో బాధపడే వారిలో రోజురోజుకు రక్తంలోని ప్లేట్లెట్లను సంఖ్య తగ్గిపోవటం వల్ల ఇది తీవ్ర ప్రమాదానికి కారణం అవుతుందని చెప్పవచ్చు.మరి ఈ విధమైనటువంటి విషజ్వరాలతో బాధపడేవారు తమ ప్లేట్లెట్స్ సంఖ్య పెంచుకోవాలంటే తప్పనిసరిగా ఈ చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
డెంగ్యూ జ్వరంతో బాధపడుతూ ప్లేట్లెట్స్ సంఖ్య క్రమంగా తగ్గిపోతున్న వారు తప్పకుండా బొప్పాయి పండును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బొప్పాయిలో ప్లేట్ లెట్స్ సంఖ్యను పెంచే గుణాలు ఉంటాయని, కేవలం బొప్పాయి మాత్రమే కాకుండా బొప్పాయి ఆకుల రసం తీసుకోవటం వల్ల తొందరగా మన శరీరంలో ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. వీటితోపాటు దానిమ్మ, నారింజ పండ్ల జ్యూస్ తీసుకోవడం వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
రోజుకు ఏవైనా రెండు రకాల పండ్లను పండ్ల రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలను పొందవచ్చు. అదేవిధంగా ఖర్జూరాలను మూడుపూటలా పాలలో కలుపుకొని లేదా సాధారణంగా తిన్నా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా డెంగ్యూ జ్వరంతో బాధపడేవారు కివి పండును తినడం ఎంతో మంచిదని ఈ పండును తినడం వల్ల తొందరగా రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
సహజ సిద్ధంగా ప్లేట్లెట్స్ పెంచుకోవాలని భావించేవారు ప్రతిరోజు ఉదయం రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బలను నమిలి తినడం ద్వారా మన శరీరానికి కావలసిన ప్లేట్లెట్లను పెంచుకోవచ్చు.ఇలా వివిధ రకాల పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటూ తగినన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల త్వరగా మన శరీరంలో తగ్గిపోయిన ప్లేట్లెట్ సంఖ్యను వృద్ధి చేసుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…