Vijay Devarakonda: విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం లైగర్. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కాస్త శృతి మించుతున్నాయని చెప్పాలి. గతంలో ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా విజయ్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.
ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ ఒక ప్రమోషనల్ వీడియోని తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. ఇక ఈ వీడియో వైరల్ కావడంతో ఈ వీడియో పై కొందరు అభిమానులు స్పందిస్తూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏకంగా ఈ విషయం పోలీసులు సైతం సీరియస్ గా తీసుకోవడం గమనార్హం.
ఈ సందర్భంగా విజయ్ వీడియో పై ఓ అభిమాని స్పందిస్తూ ఇండియా బ్లాస్ట్ ఆన్ ఆగస్టు 25 అంటూ కామెంట్ చేశారు. అయితే సినిమాటిక్ గా ఈ కామెంట్ కు అగ్గి రాజేద్దాం అని అర్థం వస్తుంది. అయితే ఈ కామెంట్ పై స్పందించిన మరొక నేటిజన్ భారీగా పేలుడు చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు వెంటనే చర్యలు తీసుకోండి అంటూ హైదరాబాద్ పోలీసులకు ట్యాగ్ చేశారు.
అయితే ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులు సరదాగా కాకుండా సీరియస్ గా తీసుకొని వుయ్ ఆర్ అలర్ట్ అంటూ రిప్లై ఇచ్చారు. ఇలా పోలీసులు సైతం అప్రమత్తంగా ఉన్నామంటూ స్పందించడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సాధారణంగా విజయ్ దేవరకొండ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ద్వారా ఆడియన్స్ అటెన్షన్ తన వైపుకు తిప్పుకుంటారు. అయితే అభిమానుల సైతం విజయ్ దేవరకొండను అనుసరిస్తూ ఇలా అందరి అటెన్షన్ సినిమాపై ఉండేలా ప్రయత్నం చేస్తున్నారని అయితే ఇలాంటి కామెంట్స్ ఎంతటి పరిణామాలకు దారితీస్తాయోనని పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…