Samantha: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర తారగా ఓ వెలుగు వెలిగిన సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఈమె విడాకుల తర్వాత మొదటిసారిగా స్క్రీన్ పై ఐటమ్ సాంగ్ ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.ఈ పాటతో దేశవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న సమంతకు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తున్నాయని చెప్పాలి.
ఇలా దక్షిణాది ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సమంతకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నప్పటికీ ఈమెకు మొదటి హీరోయిన్ గా కాకుండా సెకండ్ హీరోయిన్ అలాగే గెస్ట్ పాత్రలలో అవకాశాలు వస్తున్నాయని సమాచారం. అయితే సమంతకు బాలీవుడ్ ఆఫర్స్ వస్తున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ ఇంతవరకు ఒక్క సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు.
తనకు బాలీవుడ్ లో అవకాశాలు వచ్చినప్పటికీ ఇలా సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయని తెలియడంతో సమంత అభిమానులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో సమంతకు సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు రావడం ఏంటి? ఈమె మొదటి హీరోయిన్ గా సినిమాలు చేయడానికి పనికిరాదా అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో సమంతకు సెకండ్ హీరోయిన్ గాను, అలాగే అతిథి పాత్రలో అవకాశాలు ఇవ్వడం తనని పూర్తిగా అవమానించినట్లేనని అభిమానులు భావిస్తున్నారు.ఇలా సమంత గురించి వస్తున్నటువంటి ఈ వార్తల పట్ల అభిమానులు అసహనం వ్యక్తం చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీపై మండిపడుతున్నారు. అయితే సమంత గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…