Movie News

Nuvvu Naku Nachav: వెంకటేష్ నువ్వు నాకు నచ్చావ్ సినిమా గురించి అలాంటి టాక్ వచ్చిందా.. కట్ చేస్తే బ్లాక్ బస్టర్?

Nuvvu Naku Nachav: విక్టరీ వెంకటేష్ ఆర్తి అగర్వాల్ జంటగా కుటుంబ కథ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం నువ్వు నాకు నచ్చావ్.ఈ సినిమా ఇప్పటికీ బుల్లితెరపై ప్రసారమైన ప్రేక్షకులు కన్నార్పకుండా చూస్తారు.ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయినటువంటి ఈ సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

నువ్వే కావాలి వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత త్రివిక్రమ్ నువ్వు నాకు నచ్చావ్ సినిమా కథ సిద్ధం చేశారు. ఈ కథ విన్నర్ వెంకటేష్ క్షణం కూడా ఆలోచించకుండా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే త్రివిక్రమ్ రాసిన స్క్రిప్ట్ లో బ్రహ్మానందం సన్నివేశాలు అవుట్ డోర్ షూటింగ్ లేదు కానీ కొందరు సూచనల మేరకు సురేష్ బాబు ఈ సన్నివేశాలను జత చేశారు.

ఇక ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ తండ్రి పాత్రలో నాజర్ రఘువరన్ వంటి నటులను పరిశీలించారు. అయితే ఈ పాత్రకు కేవలం నటుడు ప్రకాష్ రాజ్ మాత్రమే న్యాయం చేయగలరని భావించిన దర్శక నిర్మాతలు ఆయన కోసం ఎదురు చూశారు. ఆ సమయంలోనే ప్రకాష్ రాజ్ పై ఫిలిం ఛాంబర్ బ్యాన్ విధించింది. అయితే ఆయనకు ఆ బ్యాంక్ తొలగిపోయే వరకు వేచి చూసిన దర్శక నిర్మాతలు అనంతరం ఆయనతో ఈ సినిమా చేశారు.

రెండు వారాలు కూడా కష్టమే అన్నారు…

ఈ విధంగా ఈ సినిమా 190 నిమిషాల నిడివితో థియేటర్లో విడుదలైంది. ఇక ఈ సినిమా చూసిన అభిమానులు ఈ సినిమా పట్ల పెద్దగా ఆసక్తి కనబడచకపోవడంతో ఈ సినిమా ఫలితం ఆశాజనకంగా లేదని చెప్పాలి.అయితే మొదటి వారం ఈ సినిమా చూసిన ప్రేక్షకాభిమానులు ఈ సినిమా రెండు వారాలు కూడా థియేటర్లో ఆడడం కష్టమని భావించారు. అయితే రెండవ వారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు పుంజుకోవడమే కాకుండా హిట్ టాక్ సొంతం చేసుకుంది.వెంకటేష్ ఆర్తి అగర్వాల్ నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సినిమాగా నిలబడిందని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago