Adithi Agarwal : కొంతమంది హీరోయిన్లు ఒక సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయి ఒక సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. ఇక ఆ తరువాత పెద్దగా సినిమాలు హిట్ అవ్వకపోతే ఇక ఇండస్ట్రీ కి దూరమైపోతారు. కానీ ప్రేక్షకుల మదిలో మాత్రం ఎప్పటికీ ఉంటారు. కెరీర్ లో నీలదోక్కుకోడానికి ఎంత కష్ట పడినా ఫలితం లేనపుడు ఇండస్ట్రీ లో మనుగడ సాగించలేక కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీ కి దూరంగా జీవిస్తుంటారు. అలాంటి వారిలో అధితి అగర్వాల్ ఒకరు. చేసినవి కొన్ని సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులకు ఈమె సుపరిచితురాలు.
మారిపోయిన అధితి అగర్వాల్…
ఆర్తి అగర్వాల్ తెలుగులో హీరోయిన్ గా లక్కీ గర్ల్ గా ఒక వెలుగు వెలిగి అర్ధంతరంగా తన కెరీర్ ను ముగించుకుని ఈ లోకం విడిచి వెళ్ళిపోయింది. ప్రేమ పెళ్లి విషయంలో తన కెరీర్ ను పోగొట్టుకుని డిప్రెషన్ వెళ్ళిపోయి సన్నబడటానికి లైపో చేయించుకుని ఆరోగ్యం వికటించి మరణించింది. ఇక ఆమె చెల్లెలు గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అధితి ఆగర్వాల్ రాఘవేంద్రరావు దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన గంగోత్రి సినిమాలో హీరోయిన్ గా అలరించింది.
ఇక ఆ సినిమా తరువాత కొడుకు, ఏం బాబు లడ్డు కావాలా, విద్యార్ధి వంటి సినిమాల్లో నటించినా పెద్దగా విజయం సాధించకపోవడంతో ఇక అప్పటికే ఆర్తి అగర్వాల్ తన కెరీర్ ను పోగొట్టుకోవడంతో అధితి కెరీర్ కూడా ముందుకు సాగలేదు. ఇక ఆర్తి అగర్వాల్ మరణం తరువాత అధితి కూడా సినిమాలకు దూరమై అమెరికాలో తన తల్లిదండ్రులతో సెటిల్ అయింది. మళ్ళీ 2016 లో లవ్ హాయ్ యార్ ఆక్సెప్ట్ ఇట్ అనే సినిమాలో నటించినా పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఇక పూర్తిగా ఇండస్ట్రీ కి దూరమైన అధితి సోషల్ మీడియాలో మాత్రం తనకు సంబంధిచిన ఫోటోలను పెడుతూ ఉంటుంది. ఇక ఇంకా పెళ్లి చేసుకోలేదు అధితి అగర్వాల్.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా బ్యూటీ రంగంలో అత్యంత ఎక్కువగా వినిపిస్తున్న పదాల్లో "కొరియన్ స్కిన్‌కేర్" ఒకటి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలపై…
తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాఘవ లారెన్స్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించడం…
హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరగడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది రోజులుగా తగ్గుదల దిశగా…
కాకినాడ జిల్లాలోని తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత ఉత్కంఠ రేపుతోంది.…
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…