Singer Sunitha: శ్రావణ మాసం అంటేనే ఎన్నో వ్రతాలు పూజలకు ప్రత్యేకం. అందుకే శ్రావణ శుక్రవారం మహిళలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ భగవంతుని సేవలో నిమగ్నమవుతారు.ముఖ్యంగా శ్రావణమాసం మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనది కనుక పెద్ద ఎత్తున శ్రావణమాసంలో అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ ఉంటారు.
ఇలా శ్రావణ మాసం వచ్చిందంటే ప్రతి శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేకమైన నైవేద్యాలను తయారు చేసి భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు.ఇలా అమ్మవారిని పూజించడంలో సాధారణ మహిళల నుంచి సెలబ్రిటీల వరకు పెద్ద ఎత్తున పూజలలో నిమగ్నమవుతూ ఉంటారు. ఇకపోతే తాజాగా సింగర్ సునీత సైతం శ్రావణ శుక్రవారం పూజ నిర్వహించారు.
ఈ క్రమంలోనే శ్రావణ శుక్రవారం కావడంతో ఈమె తన ఇంట్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇలా అమ్మవారిని పూజిస్తూ సునీత పాట పాడుతూ భక్తిశ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమాన్ని పూర్తి చేశారు.ఈ క్రమంలోనే ఈ వీడియోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో ఇది కాస్త వైరల్ అయింది. ప్రస్తుతం సునీత షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
ఇకపోతే ఈమె 2021డిసెంబర్ నెలలో మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా రెండవ వివాహం తర్వాత సునీత తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈమె పలు కార్యక్రమాలకు న్యాయం నిర్ణయతగా వ్యవహరించడమే కాకుండా తన భర్త బిజినెస్ లను కూడా చూసుకుంటూ బిజీగా ఉన్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…