Movie News

Singer Chinmayi: అటెన్షన్ కోసమే ఇదంతా.. సీఎం, ఎంపీలపై కేసులు పెట్టండి.. రణవీర్ సింగ్ ఫోటోలపై సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్..

Singer Chinmayi: గత వారం రోజుల నుంచి బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. అందుకు గల కారణం ఈయన ఒక ప్రముఖ మ్యాగజైన్ కోసం న్యూడ్ ఫోటోషూట్ జరుపుకోవడమే. ఇలా మ్యాగజైన్ న్యూడ్ ఫోటోల కోసం సుమారు 50 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకొని ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చారని వార్తలు వస్తున్నాయి.

ఈ విధంగా రణవీర్ న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అవ్వడమే కాకుండా చాలామంది ఈ ఫోటోలపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. అలాగే మరికొందరు తనకు మద్దతుగా నిలబడి తన ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. ఇకపోతే రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు సైతం ఎంతో ధైర్యం ఉండాలి ఇలాంటి ఫోటోషూట్స్ చేయాలంటే అని చెప్పడమే కాకుండా మహిళలు కూడా ఇలాంటి ఫోటోలు దిగితే వారికి కూడా ఇలాంటి మద్దతే తెలపాలి అప్పుడే సమానత్వం ఉంటుంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇకపోతే ఈయన న్యూడ్ ఫోటోలపై ఏకంగా మహిళా సంఘాలు కోర్టుకు ఫిర్యాదు చేసిన విషయం కూడా తెలిసిందే. ఇలా ఈయన న్యూడ్ ఫోటోలు పట్ల వ్యతిరేకత ఏర్పడటంతో తాజాగా ఈ విషయంపై సింగర్ చిన్మయి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీకు బుద్ధుందా? పని పాట లేదా? ఇలాంటి పనికిమాలిన కేసులు కోర్టుకు వేసి కోర్టు టైం వేస్ట్ చేస్తున్నారంటూ ఈమె మండిపడ్డారు.

జనాల అటెన్షన్ కోసమే ఇదంతా…

మహిళలను ఇబ్బందులకు గురి చేస్తూ, మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న కొందరు వ్యక్తులు అలాగే రాజకీయ నాయకులను టార్గెట్ చేయండి అంటూ ఈమె హితువు పలికారు. మహిళలతో కలిసి డాన్స్లు చేసే సీఎంలు మహిళలను వేధిస్తున్న ఎంపీలు బయట దర్జాగా తిరుగుతున్నారు. అలాంటి వారిపై కేసులు పెట్టండి ఇదంతా కేవలం జనాల అటెన్షన్ కోసమే అంటూ చిన్మయి కామెంట్ చేశారు. సాధారణంగా అయితే చిన్మయి ఇలాంటి వాటికి మద్దతు తెలిపరు కానీ రణవీర్ న్యూడ్ ఫోటోలపై ఈ కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago