Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి రోజురోజుకు విపరీతమైన అభిమానులు పెరిగిపోతున్నారు.పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమాలో తన స్టైల్, మాస్ లుక్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇకపోతే ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించిన న్యూ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ లుక్ లోఅల్లు అర్జున్ చెవికి పోగులు సైడ్ హెయిర్ కట్ స్టైల్ నోట్లో సిగార్ పెట్టుకొని అచ్చం బాలీవుడ్ హీరోలా ఉన్నారు. నిజం చెప్పాలంటే బాలీవుడ్ హీరోలను తలదన్నేలా అల్లు అర్జున్ న్యూ లుక్ ఉందని చెప్పాలి. అయితే అల్లు అర్జున్ ఉన్నఫలంగా ఇలా తన లుక్ చేంజ్ చేయడం అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం తన లుక్ చేంజ్ చేసుకున్నారా అంటూ అభిమానులు ఆరాతీస్తున్నారు.
అయితే ఈ లుక్ అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం కాదు. ఈయన తాజాగా నటిస్తున్న ఒక యాడ్ కోసం ఇలాంటి లుక్ లో సందడి చేశారు. హరి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాడ్ కు సంబంధించిన లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ లుక్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా ఇలాంటి లుక్ అల్లు అర్జున్ సినిమాలలో కనుక ఉంటే ఆ సినిమా రికార్డులు సృష్టిస్తుంది అంటూ అభిమానులు వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు.
అల్లు అర్జున్ స్టైల్ కి ఫిదా అవుతున్న నెటిజన్స్…
ఈ విధంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకోగా రోజురోజుకు తన స్టైల్ మేనరిజంతో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలకు సైతం అభిమాన హీరోగా మారిపోయారు. ఇప్పటికే ఎంతోమంది అల్లు అర్జున్ అంటే తమకు ఇష్టమని తనతో నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాం అంటూ పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ కామెంట్ చేసిన విషయం మనకు తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…