Featured

Jayasudha : ముంబై హీరోయిన్లు అయితే మోజు ఎక్కువ.. వారి కుక్కలకు కూడా రూమ్స్ ఇస్తారు.. యాభైఏళ్ల సినిమా ప్రయాణం గురించి సంచలన వాఖ్యలు చేసిన జయసుధ!

Jayasudha : సహజనటిగా పేరు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్ జయసుధ తన కెరీర్ మొదలుపెట్టి నేటికి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇంతటి సుధీర్ఘ ప్రస్థానంలో ఆమె ఎన్నో ఒడిదుడుకులు, కష్టాలు చూసారు. ఇక ఇండస్ట్రీ లో ఒక తెలుగమ్మాయి హీరోయిన్ గా ఉంటే ఇండస్ట్రీ లో ఎలా చూస్తారు అన్న విషయాలను, మా ఎలక్షన్ కి సంబంధించిన విషయాలను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షో లో వెల్లడించారు. ఇక ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలయింది.

ముంబై నుండి వచ్చారంటే వాళ్ళ కుక్కలకు కూడా స్పెషల్ గదులు…

సినిమాల్లో ఉన్న లోతుపాట్ల గురించి జయసుధ మాట్లాడారు. యాభై ఏళ్ల కెరీర్ అంతా చూసుకుంటే హీరోలతో సమానంగా మమ్మల్ని చూడరు వివక్ష ఉందంటూ చెప్పారు. ముంబై నుండి వచ్చే హీరోయిన్లంటే ఎక్కువ మోజు ఉంటుందని వాళ్ళకైతే వాళ్ళ కుక్కలకు కూడా స్పెషల్ గదులు తీస్తారంటూ కామెంట్స్ చేశారు జయసుధ. ఇక హీరోలకు డాన్స్ రాకపోయినా హీరోయిన్లను పక్కకు పిలిచి సరిగా వేయి స్టెప్పులు అంటూ చెప్పిన సందర్భాలు ఉన్నాయి అన్నారు. అయితే హీరోలు ఎప్పుడు డామినేట్ చేయరు వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు ఎక్కువ చేస్తారు అంటూ కామెంట్ చేసారు. ఇక శోభన్ బాబు గారి గురించి మాట్లాడుతూ తనను ‘ఏమోయ్’ అని పిలిచేవారని డబ్బు ఎలా జాగ్రత్త చేసుకోవాలో తెలుసుకోనుంటే ఆయనతో బాగుండేదని, నీకో మంచి ప్లేసు చూపిస్తా మీ నాన్నకు చెప్పి కొనుక్కో అంటూ అనేవారని, అప్పట్లోనే మహానటి సినిమా తీసుంటే డబ్బు జాగ్రత్త చేసుండే దానినని చెప్పారు.

యాభై ఏళ్ళు పూర్తియినందుకు ఒక పూల బొకే కూడా ఎవరు ఇవ్వలేదు…

తాను ఇండస్ట్రీ లో అడుగుపెట్టి యాభై ఏళ్ళు పూర్తియినందుకు ఒక్కరు కూడా నాకు అభినందనలు చెప్పలేదు అదే బాలీవుడ్ లో అయితే కనీసం ఒక పూల బొకే అయినా ఇచ్చుండేవారు. ఇక్కడ అలాంటిదేమీ లేదు. అదే ఒక హీరో కి అయితే ఒక పండగ లాగా చేస్తారు అంటూ అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇక మా అసోసియేషన్ రాజకీయాలు, అక్కడ ఎన్నికల గురించి మాట్లాడుతూ ఎలక్షన్ ఉందని తెలిసీ ఆ గోల అవన్నీ ఎందుకని ఆమెరికాలోనే ఇంకో నెల ఉండిపోయాను. మా అసోసియేషన్ బిల్డింగ్ మురళి మోహన్ హయాంలోనే కట్టాలని అనుకున్నారు ఇప్పటివరకు లేదు. నా కెరీర్ ఇంకో 25 ఏళ్ళు ఉంటే అప్పటికైనా కడతారో లేదో చూడాలి అంటూ అభిప్రాయపడ్డారు. ఇక మోహన్ బాబు జయసుధ నాకు కాకుండా ఎవరికి ఓటు వేస్తుంది అంటూ చేసిన వాఖ్యలకు దాని గురించి మాట్లాడాలంటే నా యాభై ఏళ్ల కెరీర్ సరిపోతుంది అంటూ వ్యంగ్యంగా అన్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago