Featured

Bandla Ganesh : హీరోలను రేటు తగ్గించుకోమనడానికి మీరెవరు… సినిమా గురించి ఏమి తెలియని వాళ్ళు ప్రొడ్యూసర్లుగా చలామణి అవుతున్నారు.. బండ్ల గణేష్

Bandla Ganesh : ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ సినిమా షూటింగుల బంద్. నిర్మాణ వ్యయం పెరిగి నిర్మాత నష్టపోతున్నాడని నిర్మాతల గిల్డ్ సినిమాల షూటింగులను బంద్ చేసారు. ఇక దీనీపై రకరకాలుగా స్పందిస్తున్నారు సినిమా పెద్దలు. కొంతమంది సరైన నిర్ణయం అంటుంటే మరికొంతమంది మాత్రం సినిమా షూటింగులను ఆపడమెంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక హీరోల రెమ్యూనరేషన్లు తగ్గించుకుంటే సినిమా బడ్జెట్ తగ్గుతుందని నిర్మాతల గిల్డ్ అభిప్రాయపడటం హీరోలు తగ్గించుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది ఇక ఈ విషయం పైన అశ్విని దత్ స్పందించాడు.

సినిమాలతో సంబంధం లేనివాళ్లు గిల్డ్ లో ఉన్నారు…

నిర్మాత అశ్వినిదత్ మాట్లాడుతూ హీరోలను రెమ్యూనరేషన్ తగ్గించుకోమనండం ఏంటని ప్రశ్నించారు. సినిమా టికెట్ రేట్లు పెంచమని అడిగిన వారే ఈరోజు రేట్లు తగ్గించమని అడుగుతున్నారు అంటూ కామెంట్స్ చేసారు. ఇక ఈ మాటల్తో తాను ఏకిభవిస్తున్నాను అంటూ నిర్మాత,నటుడు బండ్ల గణేష్ మాట్లాడారు. ఏ హీరోను, డైరెక్టర్ ను పారితోషికం తగ్గించకోమని అడిగే హక్కు నిర్మాతకు లేదని వాఖ్యనించాడు. మార్కెట్లో ఒక్కో కారుకి ఒక్కో రేట్ ఉంటుంది. అన్ని కార్లే అయిన రేట్లు వేరుగా ఉంటాయి. మనం స్థోమతను బట్టి కార్లను కొంటాము. అలాగే హీరోల మార్కెట్ ను బట్టి హీరోలకు రేటు ఉంటుంది.

నువ్వెవ్వరు హీరోలను రెమ్యూనరేషన్ తగ్గించుకోమని చెప్పడానికి, ఆ హీరో తో సినిమా చేస్తున్నావ్ అంటే ఆయనకు ఉన్న మార్కెట్ ను కవర్ చేసి లాభలను తెచ్చుకోగలవనే నమ్మకంతోనే సినిమా చేయాలి. అంతే కానీ రేటు తగ్గించుకోమనడానికి నువ్వెవరు. అసలు నిర్మాతల గిల్డ్ ఏమిటి అవసరం ఏముంది, ఒక అసోసియేషన్ లేక ఛాంబర్ ఏర్పాటు చేయొచ్చు కదా ఇదేందుకు. ఇక ఆ గిల్డ్ లో సినిమా గురించి ఏ మాత్రం జ్ఞానం లేని వాళ్ళు మెంబెర్స్ గా ఉన్నారు. సినిమాకు ఏ లైట్లు వాడుతారో కూడా తెలియని ప్రొడ్యూసర్లు ఉన్నారు. నేను నటుడుగా, ప్రొడక్షన్ మేనేజర్ గా ప్రొడ్యూసర్ గా ఉన్నాను. సినిమా ఇండస్ట్రీ నన్ను ఎప్పుడు నిరుత్సాహ పరచలేదు అంటూ హాట్ కామెంట్స్ చేసారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago