దొంగలు కూడా స్మార్ట్ గా దొంగిలించడానికి ఇష్టపడుతున్నారు. ఎక్కడ చూసినా సీసీ ఫుటేజీల కారణంగా వెంటనే దొరికిపోతున్నామని.. వాళ్లు కూడా అప్ డేట్ అయ్యారు. ఇలా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. అమ్మాయిలని ఎర వేసి.. సమస్తం దోచుకెళ్తున్నారు. ఇలానే ఓ వక్తిని నిలువునా ముంచేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేపీహెచ్ బీ కాలనీకి చెందిన శ్రీధర్ భద్రాచలం వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
ఈ నేపథ్యంలోనే మెట్రో స్టేషన్ కి వెళ్లి అక్కడ నుంచి ఎంజీబీఎస్ వెళ్లి అక్కడ నుంచి బస్సులో వెళ్లాలనుకున్నాడు. కానీ కేపీహెచ్ బీ మెట్రో స్టేషన్ లో విజయ అనే ఓ యువతి అతడికి తారసపడింది. శ్రీధర్ కు మాయమాటలు చెప్పి తన ప్రయాణాన్ని వాయిదా వేసుకునేలా చేసింది.
చివరకు అతడు ఆమెతో వెళ్లే విధంగా చేసింది. ఇద్దరు కలిసి అక్కడ నుంచి ఓ ఆటోలో వెళ్లారు. అతడిని ఓ నిర్మాణుష్య ప్రాంతానికి తీసుకెళ్లింది ఆ యువతి. అప్పటికే అక్కడ తన స్నేహితులు జోగేందర్ సింగ్, ముత్యాల విష్ణులు ఉన్నారు. శ్రీధర్ రాగానే అతడిపై దాడి చేయడం మొదలు పెట్టారు. దీంతో అతడు ప్రతిఘటించగా కోపంతో వాళ్లిద్దరు అతడిని గాయపరిచి ఫోన్, వాచ్, పర్సు, డబ్బులను తీసుకొని పారిపోయారు.
అక్కడ నుంచి అతడు భద్రాచలం వెళ్లి స్నేహితుడికి ఫోన్ చేశాడు. జరిగిన విషయం చెప్పి పోలీసులకు ఫిర్యాదు చేయమని చెప్పాడు. అతడు జగద్గిరి గుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. విచారణలో భాగంగా రంగంలోకి దిగిన పోలీసులు ఆ ముగ్గరుని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 10 గ్రాముల బంగారం, రెండు బైక్ లను స్వాధీనం చేసుకొని నిందితులును రిమాండ్ కు తరలించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…