Featured

పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాను శోభన్ బాబు ఎందుకు రెజెక్ట్ చేసారో తెలుసా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి అందగాడిగా, ఎంతో మంది మహిళల పట్ల ఎలాంటి రాకుమారుడిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో అవకాశాలు కోసం ఎంతో కష్టపడిన శోభన్ బాబు ఆ తర్వాత హీరోగా ఎదిగి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. అయితే ఇండస్ట్రీలో ఎన్నో అవకాశాలు వస్తున్నప్పటికీ శోభన్ బాబు తనకు 60 సంవత్సరాలు రాగానే తనకుతానుగా సినిమాలకు రిటైర్మెంట్ తీసుకున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సంపాదించుకున్న శోభన్ బాబుతో కలిసి నటించడం కోసం ఎంతో మంది యువ హీరోలు ఆరాటపడ్డారు. ఈ క్రమంలోనే శోభన్ బాబుతో కలిసి సినిమాలలో నటించాలని చాలా మంది భావించినప్పటికీ శోభన్ బాబు వారికి ఊహించని షాక్ ఇచ్చారు.ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ను ప్రారంభించిన మొదట్లో శోభన్ బాబుతో కలిసి నటించే అవకాశం వచ్చింది. పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన సుస్వాగతం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రలో రఘువరుణ్ ఎంతో అద్భుతంగా నటించి అందరిని మెప్పించారు. అయితే ఈ సినిమా మొదట్లో రఘువరన్ పాత్రలో పవన్ కళ్యాణ్ తండ్రిగా హీరో శోభన్ బాబును నటించమని కోరారు. అయితే అప్పటికే తాను సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చారు అని ఒక్కసారి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్లీ సినిమాలలో నటించేది ఉండదని ఖరాఖండిగా చెప్పడంతో శోభన్ బాబు పాత్రలో రఘువరన్ తీసుకోవాల్సి వచ్చింది.

ఈ విధంగా సుస్వాగతం సినిమాలో శోభన్ బాబుతో కలిసి నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు సినిమాలో కూడా మహేష్ బాబు తాత పాత్రలో ముందుగా శోభన్ బాబును సంప్రదించగా అతను చెప్పడంతో ఆ పాత్రలో నాజర్ చేశారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ మహేష్ బాబుకి శోభన్ బాబుతో కలిసి నటించే అవకాశం వచ్చినప్పటికీ శోభన్ బాబు నుంచి వీరికి చేదు అనుభవం ఎదురైంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సచిన్‌తో హీరోయిన్ ప్రేమాయణం?.. అసలు నిజం బయటపెట్టిన నటి

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…

18 minutes ago

విజయవాడ దుర్గమ్మ హుండీ లెక్కలు.. రూ.2.68 కోట్ల ఆదాయం!

విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…

36 minutes ago

సీఎస్‌కేకు మరో షాక్.. ఖలీల్ అహ్మద్ టోర్నీ నుంచి ఔట్

ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…

1 hour ago

హైకోర్టులో స్వయంగా వాదించిన రఘురామ.. ఆకివీడు రామాలయం కేసులో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…

1 hour ago

మునగాకు పొడి మాయలు.. ఈ సమస్యలకు సులభ పరిష్కారం!

ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న ఈ కాలంలో సహజ ఆహార పదార్థాలపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. అందులో మునగాకు పొడి…

1 hour ago

నిద్రలేవగానే బెడ్ సర్దేస్తున్నారా? ఉదయం ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందా?

ఉదయం నిద్రలేవగానే బెడ్‌ను సర్దేయడం చాలా మందికి అలవాటు. ఇది క్రమశిక్షణకు సంకేతమని భావిస్తారు. కానీ ఇదే అలవాటు ఆరోగ్యపరంగా…

2 hours ago