ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చారు ఓ దంపతులు. వారికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఓ రోజు ఇంట్లో పిల్లలను ఉంచి పనికి వెళ్లింది ఆ మహిళ. ఇంటికి వచ్చే సరికి దారుణం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రదీప్‌రావుకు, దుర్గావతి దంపతులు. వారికి ముగ్గురు సంతానం. ముగ్గరు కూడా చిన్న పిల్లలే.
ఉపాధి నిమిత్తం వాళ్లు హైదరాబాద్ కు కొన్నేళ్ల క్రితం వచ్చారు. ప్రదీప్ రావు కుత్బుల్లాపూర్ బీహెచ్‌ఈఎల్ విస్టాకాలనీలోని శ్రీసాయి నిలయం అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తున్నాడు. దుర్గావతి పలు ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఓ రోజు ఉదయం ప్రదీప్ రావు తన డ్యూటీకి వెళ్లిపోగా.. పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా ఇళ్లల్లో పని చేసేందుకు ఆ మహిళ వెళ్లింది.
ఇంట్లోనే ఆడుకొమ్మని వెళ్లిన మహిళ.. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే సరికి ఘోరం జరిగిపోయింది. బాత్రూంకి వెళ్లి చూడగా.. అందులోని ఓ బకెట్లో రెండేళ్ల కొడుకు పడి ఉన్నాడు. దీంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. వెంటనే 108 కి కాల్ చేసి.. ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంతో ..ఆ బాలుడు చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు.
దీంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన హైదరాబాద్ పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…