Featured

మరో కేసులో ఇరుక్కున్న దాసరి అరుణ్..!

దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్‌కుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేశారు. ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదయినట్టు తెలుస్తుంది. అసలు విషయం ఏమిటంటే.. బొల్లారం ప్రాంతానికి చెందిన బ్యాగరి నర్సింహులు వెంకటేష్‌ అనే టెక్నీషియన్‌ 2012 నుంచి 2016 వరకు దాసరి వద్ద మూవీ రిస్టోరేషన్‌ ఔట్‌సోర్సింగ్‌ పనులు చేసేవారట. అయితే ఆ సమయంలో దాసరి కుమారులు ప్రభు, అరుణ్‌కుమార్‌ ఇద్దరికీ అతను బాగా పరిచయం. ఇక నవంబర్‌ 15, 2018 న దాసరి నారాయణరావు మరణించిన తరువాత ఇదివరకు చేసుకున్న పాత ఒప్పందాన్ని రద్దు చేసి కొత్తగా మరో ఒప్పందం కుదుర్చుకున్నారు.

అయితే ఇటీవల డబ్బులు ఇవ్వాల్సి వచ్చిన సమయంలో దాసరి అరుణ్ డబ్బులు ఇవ్వనని అసలు తాను ఆ ఒప్పందంపై సంతకం చేయలేదని చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 13న రాత్రి తన డబ్బుల గురించి అడిగినప్పుడు ఫిలింనగర్ లోని ఎఫ్‌ఎన్‌సీసీ కి రమ్మని అరుణ్ కుమార్ చెప్పగా.. చక్రపాణి అనే ప్రత్యక్ష సాక్షిని తీసుకొని వెళ్లానని బాధితుడు చెప్పాడు.

తన డబ్బులు అడిగేందుకు వెళ్ళిన అతనిని దాసరి అరుణ్‌కుమార్‌ దూషిస్తూ.. కులం పేరుతో తనను తిట్టారని, నీ అంతు చూస్తానంటూ బెదిరించారని అయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో దాసరి అరుణ్ కుమార్ నుంచి తనకు ప్రాణహాని ఉందని బాదితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరుణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago