Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హైపర్ ఆది ఈ మధ్యకాలంలో వెండితెరపై కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని అక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నా అది ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమాలో కూడా సందడి చేశారు.
ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా తాజాగా సినిమా నుంచి జంజం జజ్జనక అనే సాంగ్ విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది మాట్లాడుతూ డైరెక్టర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సాంగ్ అంటే తనకు చాలా ఇష్టమని ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే తన బర్త్డే రావడంతో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారని తెలిపారు. ఇక ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని ఈయన ఆకాంక్షించారు.ఇక మెహర్ రమేష్ గురించి మాట్లాడుతూ మెహర్ రమేష్ అంటే ప్రతి ఒక్కరూ శక్తి షాడో సినిమాలను మాత్రమే గుర్తు చేసుకుంటారు. మంచి సక్సెస్ సాధించినటువంటి ప్రభాస్ కెరియర్లో మోస్ట్ స్టైలిష్ మూవీ ఏదైనా ఉందా అంటే అది బిల్లా మాత్రమే ఆ సినిమాకు డైరెక్టర్ రమేష్ అని గుర్తు చేశారు.
ప్రతి ఒక్కరికి సక్సెస్ ఫెయిల్యూర్ రావడం సర్వసాధారణం కానీ సక్సెస్ మర్చిపోయి ఫెయిల్యూర్స్ గుర్తించి ట్రోల్ చేయడం మంచిది కాదని 100 సెంచరీలు కొట్టిన కోహ్లీ కూడా ఇప్పుడు ఒక సెంచరీ కొట్టడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే అది కేవలం మన టైం బాగలేదని అర్థం ప్రతిదానికి టైం రావాలి.ఫెయిల్యూర్స్ వల్లే ట్రోల్ చేయాల్సి వస్తే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరుని ట్రోల్ చేయాల్సి ఉంటుందని ఈ సందర్భంగా ఆది చేస్తున్నటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…