RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి ఆదరణ సంపాదించుకుందో మనకు తెలిసిందే. అదే విధంగా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం కూడా విశేషం.ఇలా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నటువంటి ఈ సినిమాకు సీక్వెల్ చిత్రం ఉంటుందని ప్రకటించారు.
ఈ సినిమా చిత్రం మరింత ఆలస్యం అవుతుందని అయితే తప్పకుండా ఉంటుందని రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అయితే గత రెండు రోజుల క్రితం ఈయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా సీక్వెల్ ఉంటుంది కానీ ఈ సినిమాకి బహుశా రాజమౌళి దర్శకత్వం వహించకపోవచ్చు అంటూ కామెంట్ చేశారు.
రాజమౌళి దర్శక పర్యవేక్షణలో ఈ సినిమా తెరకెక్కుతుంది కానీ ఆయన దర్శకత్వం చేయకపోవచ్చు అంటూ విజయేంద్ర ప్రసాద్ చెప్పడంతో ఎన్టీఆర్ రామ్ చరణ్ అభిమానులు ఈ విషయాన్ని కాస్త జీర్ణించుకో లేకపోయారు. ఇలాంటి ఓ గొప్ప సినిమాకు రాజమౌళి అయితేనే బాగుంటుందని అందరూ అనుకున్నారు.
ఇక ఈ సినిమాకు రాజమౌళి కాకుండా మరే డైరెక్టర్ డైరెక్ట్ చేస్తారన్న విషయం గురించి చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాకు కార్తికేయ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించవచ్చు అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. అయితే ఈయన డైరెక్టర్ అయితే నిజంగానే హీరోలు ఆయన డైరెక్షన్లో సినిమా చేస్తారా అన్న సందేహాలను కూడా వ్యక్తపరుస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…