Movie News

Hyper Aadi: షూటింగ్ మధ్యలో నుంచి హైపర్ ఆదిని అరెస్టు చేసి తీసుకెళ్లిన పోలీసులు.. రోడ్ యాక్సిడెంటే కారణమా?

Hyper Aadi: బుల్లితెర స్టార్ నటుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న హైపర్ ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం నుంచి దూరం అయినా శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇక శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం నుంచి సుడిగాలి సుదీర్ తప్పుకోవడంతో ఈ కార్యక్రమానికి రష్మీ ఎంట్రీ ఇచ్చి తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది వేసే పంచ్ డైలాగులకు విపరీతమైన క్రేజ్ ఉందని చెప్పాలి.

ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా పోలీసులు హైపర్ ఆదిని అరెస్టు చేసి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది.ఈ విధంగా పోలీసులు షూటింగ్ మధ్యలో నుంచి హైపర్ ఆదిని అరెస్టు చేసి తీసుకెళ్లడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే ఏం జరిగిందా అంటూ పెద్దఎత్తున ఆరా తీస్తున్నారు.

ఈ ప్రోమోలో భాగంగా పోలీసులు వేదికపైకి వచ్చి ఆదిని అరెస్టు చేస్తున్నట్లు తెలియజేశారు. ఆదిని అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఈయన రోడ్ యాక్సిడెంట్ చేయడం వల్ల ఓ వ్యక్తి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని తెలియడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు.అయితే ఈ యాక్సిడెంట్ హైపర్ ఆది చేసినట్టు మీరు పొరపాటు పడి ఉంటారని అక్కడున్న వారు చెప్పగా పోలీసులు ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

షో రేటింగ్ కోసమే ఇలా..


ఈ విషయం గురించి పక్కకెళ్లి మాట్లాడదాం అంటూ పోలీసులను పిలిచే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు మాత్రం హైపర్ ఆదిని వేదికపై నుంచే అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ విధంగా వేదికపై నుంచి పోలీసులు హైపర్ ఆదిని తీసుకు వెళ్లడంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణం హీట్ ఎక్కింది. అయితే నిజంగానే హైపర్ ఆది యాక్సిడెంట్ చేశారా లేకపోతే ఎప్పటిలాగే వీరీ చీప్ ట్రిక్స్ ప్లే చేశారా అనే విషయం తెలియాలంటే ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే వరకు వేచి చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

1 day ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

1 day ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

1 day ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

1 day ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

1 day ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

1 day ago