Hyper Aadi: జబర్దస్త్ వేదికపై పుష్ప స్కిట్ చేసిన హైపర్ ఆది.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బన్నీ అభిమానులు!
Hyper Aadi: బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రతి వారం ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో హైపర్ ఆది ఒకరు.ప్రతి వారం ఏదో ఒక స్కిట్ ద్వారా ప్రేక్షకులను నవ్వించడంలో హైపర్ ఆదికి ఎవరూ సాటి లేరని చెప్పవచ్చు. ఇకపోతే హైపర్ ఆది స్కిట్ బాగా రావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
ఈ ప్రయత్నంలో భాగంగా కొన్ని సార్లు నెటిజన్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. ఇలా హైపర్ ఆది చేసే స్కిట్ లు ఎన్నో వివాదాలకు దారి తీశాయి. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా హైపర్ ఆది అద్భుతమైన స్కిట్స్ ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.తాజాగా ఈ వారం ప్రసారం కాబోయే జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.
ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా హైపర్ఆది పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ప్రోగ్రామోలో భాగంగా హైపర్ ఆది పుష్ప స్కూప్ చేశారు. ఈ క్రమంలోనే బన్నీ అభిమానులు ఈ స్కిట్ పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అల్లుఅర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన పుష్ప సినిమాని ఇలా ఒక కామెడీ షోలో చేయడంతో బన్నీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలా కామెడీ చేయడం బన్నీని అవమానించినట్లేనని ఆయన అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకే ఈ వారం ఎపిసోడ్ లో భాగంగా హైపర్ ఆది చేసిన స్కిట్ టెలికాస్ట్ కాకూడదు ఒకవేళ అలా అయితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బన్నీ అభిమానులు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…