Samantha: విడాకుల పై స్పందించిన సమంత… పెళ్లికి ముందే విడాకులు అంటూ ట్వీట్!
Samantha: టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ క్రేజీ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగ చైతన్యతో వివాహం తరువాత విడాకులు తీసుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటారు.
ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ధనుష్ ఐశ్వర్య విడాకులు తీసుకోవడంతో మరోసారి వీరి విడాకుల విషయం కూడా చర్చకు వచ్చింది.ఈ క్రమంలోనే గతంలో సమంత విడాకుల విషయంపై స్పందిస్తూ చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే పెళ్లికి ముందే సమంత విడాకులపై స్పందించడం గమనార్హం.
ఈవిధంగా 2013వ సంవత్సరంలో సమంత విడాకుల విషయం గురించి మాట్లాడుతూ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతూ నెటిజన్ల ట్రోలింగ్ కి గురవుతోంది. అసలు విడాకుల విషయమై సమంత ఏమని స్పందించారు అనే విషయానికి వస్తే…
2013వ సంవత్సరంలో ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో చాట్ చేస్తూ ఉండగా ఓ అభిమాని సమంతను విడాకుల గురించి ఓ ప్రశ్న అడిగారు. ఈ క్రమంలోనే సమంత ఆ ప్రశ్నకు సమాధానం చెబుతూ… నేను పెళ్లి చేసుకుంటా.. విడాకులు కూడా ఇస్తాను మీరు చూస్తూ ఉండండి మనిద్దరం కలిసి డాన్స్ చేస్తామంటూ ఈమె సమాధానం చెప్పారు.పెళ్లికి ముందే సమంత విడాకులు ఇస్తాను అని చెప్పిన విధంగానే ఇప్పుడు విడాకులు ఇచ్చిందని ఈ మాత్రం దానికి పెళ్లి ఎందుకు చేసుకోవాలి అంటూ సోషల్ మీడియా వేదికగా దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సమంత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…