హైపర్ ఆది.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను తన కామెడీ పంచ్ లతో కడుపుబ్బా నవ్విస్తుంటాడు. అయితే ఈ మధ్య హైపర్ ఆధి వార్తల్లో బాగా వస్తున్నాడు. సోషల్ మీడియాలో అతడిపై ఇష్టం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రముఖ హీరో అభిమానులు అతడిపై కోపంగా ఉన్నారని.. దీంతో అతడు మూడు రోజుల నుంచి కనిపించడం లేదంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అతడు ఇన్ స్టాగ్రామ్ లో వీటిపై ఓ వీడియోను షేర్ చేశారు. అవన్నీ పేక్ వార్తలు అని.. తాను ఎక్కడకు వెళ్లలేదని.. జబర్దస్త్ స్కిట్లు చేస్తున్నానని.. తన పక్కన రైజింగ్ రాజు, శాంతి స్వరూప్ ఉన్నారని మాట్లాడారు.
ఇలా ఫేక్ వార్తలు రాసే వాళ్లకు ఒక్కటే చెబుతున్నా.. మీ దగ్గర డబ్బులు లేకపోతే నన్ను అడగండి రా ఇస్తాను.. కానీ ఇలా ఫేక్ వార్తలు రాయకండి. ఇలా చేయడం ఎవరికీ మంచిది కాదు అంటు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. వినకపోతే శాంతి స్వరూప్ ను మీపై వదులుతా అంటూ కామెడీగా చెప్పాడు. ఇలా అతడిపై విభిన్న వార్తలు రావడానికి కారణం ఏంటంటే.. దీపావళి కారణంగా ప్రముఖ ఛానల్లో ప్రసారం అయిన ఓ షోలో అతడు మా అధ్యక్షుడు మంచు విష్ణును ఇమిటేట్ చేస్తూ మాట్లాడారు.
దీంతో అతడి అభిమానులు కోపంతో ఉన్నారని.. అందుకే ఆది భయపడి దాక్కున్నాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆది వీటిపై ఈ వీడియోతో పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు. ఆది పంచ్ లు ఒకానొక సమయంలో కాట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తాయి. అంతకముందు కూడా అతడు క్షమాణలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…