తెలుగులో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాల్టీ షో రోజురోజుకూ ఆసక్తిని రేపుతోంది. అందులో అడుగుపెట్టిన 19 మందిలో చివరకు 10 మంది మిగిలారు. అందులో జెస్సీ అనారోగ్యం కారణంగా సీక్రెట్ రూంలో ఉన్నారు. ఇక మిగిలిన 9 మందిలో ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు 5 గురు నామినేట్ అయ్యారు.
అందులో సిరి, రవి, కాజల్, మానస్ మరియు సన్నీ ఉన్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే టెన్షన్ ప్రతీ ఒక్కరిలో ఉంది. ఈవారం కాజల్ ఎలిమినేట్ అవుతారని.. ఆమెకు బయట ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడం.. ఓట్లు కూడా అతి తక్కువగా వస్తుండటంతో ఎలిమినేట్ పక్కా అనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈ హౌస్ లో ప్రియాంక సింగ్ కు మానస్ అంటే పడి చచ్చిపోతుంది.
మానస్ ను లవ్ చేస్తున్నట్లు చెప్పినా మానస్ మాత్రం దానికి తిరిగి సమాధానం చెప్పలేకపోయాడు. ప్రస్తుతం మానస్, ప్రియాంక్ లవ్ ట్రాక్ హాట్ టాపిక్ గా మారింది. దీనిపై మానస్ తల్లి పద్మిని కూడా స్పందించిన విషయం తెలిసిందే. ఆమెతో మానస్ కు పెళ్లి చేయడం తనకు ఇష్టం లేదని చెప్పింది. అయితే మానస్ రియల్ లైఫ్ లవ్ స్టోరీని ఆమె రివీల్ చేశారు. అందులో కూడా తానే విలన్ అని.. పెళ్లి దాక వెళ్లకుండా తానే అడ్డు పడ్డానని చెప్పుకొచ్చింది.
మానస్ కాలేజీ టాపర్ అని .. అలాంటి టైంలో పెళ్లి చేస్తే కెరీర్ దెబ్బ తింటుందనే కారణంతో తాను వ్యతిరేకించినట్లు చెప్పింది. ఆమె యూఎస్ వెళ్తుందని తనకు చెబితే.. కెరీర్ వదిలేసి వెళ్లడం ఇష్టం లేదని చెప్పానన్నారు. ఇదిలా ఉండగా.. మానస్ కు మూడు లవ్ బ్రేకులు ఉన్నాయని.. సన్నీ హౌస్ లో ఓ సందర్భంలో చెప్పాడు. అయితే వాటి గురించి పద్మినిని అడిగినప్పుడు తనకు తెలియది సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…