మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కుర్ర హీరోలు మెగాస్టార్ చిరు స్పీడ్ ని అందుకోలేక పోతున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమాలో బిజీ బిజీగా ఉన్న చిరంజీవి ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది ఇలా ఉంటే తాజాగా చిరంజీవి బోళా శంకర్ ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి.
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మొహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. ఇందులో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటించనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ హాజరై అట్టహాసంగా నిర్వహించారు.
సీనియర్ దర్శకులు రాఘవేంద్ర రావు, డైరెక్టర్ బాబీ, వివి వినాయక్, హరీష్ శంకర్, కొరటాల శివ, గోపీచంద్ మలినేని ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ బోళా శంకర్ సినిమా తమిళ హిట్ వేదాళంని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
చిరంజీవి నటించిన ఆచార్య సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమా ఫిబ్రవరిలో గ్రాండ్ గా విడుదల కానుంది. సామాజిక అంశంతో కూడిన యాక్షన్ ఎంటర్ టైనర్ గా కొరటాల శివ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇందులో చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డేనటించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…
విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…
ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…