Featured

Hyper Aadi : జనసేన నుండి పోటీ చేస్తే గెలిచే సత్తా హైపర్ ఆదికి ఉందా…!

Hyper Aadi : జబర్దస్త్ నుండి ఎదిగిన కమెడియన్ హైపర్ ఆది కి పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆది జబర్దస్త్ పుణ్యమా అని నేమ్ ఫేమ్ ఆస్తులు సంపాదించుకుని కెరీర్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఆది తన పంచ్ డైలాగులకు జబర్దస్త్ లో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇదంతా గతం అనలేమో. ఎందుకంటే మొదట్లో ఆది పంచ్ డైలాగులు ఫ్యామిలీ అంతా చూసి నవ్వుకునేలా ఉండేవి. ఇక ఆది కెరీర్ అటు జబర్దస్త్ ఇటు ఢీ షో అంటూ మరో వైపు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ ఇలా చేతి నిండా సంపాదిస్తున్నాడు. అయితే ఇప్పుడు పాలిటిక్స్ వైపు చూస్తున్నాడు ఆది.

జనసేన నుండి ఎమ్మెల్యే గా ఆది…

జబర్దస్త్ లో పంచ్ లతో ఆకట్టుకున్న ఆది, ఆ షోలో మెగా అభిమానులకు అలానే నాగబాబు కి బాగా చేరువయ్యాడు. అలా నాగబాబుతో ఉన్న సన్నిహిత్యంతోనే ముందు ఎన్నికలలో జనసేన తరపున ప్రచారం చేసాడు. ఇక హరి హర వీర మల్లు సినిమాలో నటిస్తున్న ఆది ఆ సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ కు బాగా దగ్గరయ్యాడు. అధినేత తో అరగంట మాట్లాడి మాటలతో ఆకట్టుకునేసాడు. అలా పవన్ కళ్యాణ్ కి దగ్గరైన ఆది వచ్చే ఎన్నికలలో ఏపీ లో ఎమ్మెల్యే సీటు కి పోటీ చేస్తాడా అనే ప్రశ్న ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆదికి ఎదురైంది.

రణ స్థలం ప్రచార సభలో ప్రత్యర్థ పార్టీ పై పంచుల వర్షం కురిపించిన ఆది శ్రీకాకుళం యువశక్తి సభలో ఒక అభ్యర్థి గా మాట్లాడుతున్నా అంటూ స్పీచ్ ఇవ్వడంలో అర్థాలు వేరే ఉన్నాయంటూ లెక్కలేస్తున్నారు. అందుకే జనసేన నుండి ఆది పోటీ చేస్తారని ప్రచారంలో నిజం లేదని ఆది చెప్పారు. రాజకీయాల్లో అప్పుడే పదవులను ఆశించడం లేదని, అభిరుచి కోసమే జనసేన కు మద్దతు ఇచ్చానని, సభల్లో మాట్లాడుతున్నట్లు తెలిపారు. జనసేన గురించి ప్రజలు ఆలోచించాలని ప్రజల్లో మార్పు రావాలని సూచించారు ఆది.

Bhargavi

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

16 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

17 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

2 days ago