Featured

Sarpanch Navya Praveen : 25 లక్షలు ఇస్తానని ఎమ్మెల్యే రాజయ్య నా భర్తను బుట్టలో వేసుకుని నన్ను మోసం చేసాడు…: సర్పంచ్ నవ్య

Sarpanch Navya Praveen : వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం జానకీపురంలోని సర్పంచ్ నవ్య ప్రవీణ్ మరోసారి మీడియా ముందుకు వచ్చారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య మీద మరోసారి ఆరోపణలను చేసారు నవ్య. గతంలో నవ్య తన మీద ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించగా మీడియా, ప్రజాసంఘాల ఒత్తిడి మేరకు రాజయ్య గారు ఆమె ఇంటికి వెళ్లి క్షమాపణ చెప్పి నవ్య కుటుంబంతో మాట్లాడారు. అనంతరం సర్పంచ్ నవ్య, ఆమె భర్త ప్రవీణ్ తో కలిసి రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఇపుడు తాజాగా మరోసారి నవ్య మీడియా ముందుకు వచ్చారు. 25 లక్షలు ఇస్తానని రాజయ్య మోసం చేసాడని తన భర్తను కూడా బుట్టలో వేసుకున్నాడంటూ ఆరోపిస్తున్నారు.

25 లక్షలు ఇస్తానని మోసం చేసాడు…

ఎమ్మెల్యే తాడికొండ రాజయ్య తన భర్తకు మాయమాటలు చెప్పి నా భర్తకు నాకు గొడవలు పెట్టారు అంటూ నవ్య ఆరోపించారు. నా భర్తను నమ్మించి నాతోను నా భర్త తోనూ 25 లక్షల అప్పు తీసుకుంటున్నట్లు గతంలో ఎమ్మెల్యే మీద చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని సంతకం చేయమని ఒత్తిడి చేసారు అంటూ నవ్య ఆరోపించారు.

నా భర్తను ఎమ్మెల్యే ట్రాప్ చేసాడు అంటూ నవ్య తెలిపారు. ఒక మహిళా అధికారిని మధ్యవర్తిగా పెట్టి ఇదంతా ఎమ్మెల్యే చేసాడు అంటూ నవ్య ఆరోపించారు. గ్రామంలో అభివృద్ధి పనుల కోసం డబ్బు శాంక్షన్ చేస్తానని చెప్పి మాకు ఎమ్మెల్యే అప్పుగా ఇస్తున్నట్లు ఇప్పుడు మాట మార్చారు అంటూ చెప్పారు నవ్య. డబ్బు కోసం ఇదంతా నేను చేయలేదు. నా భర్తను కూడా నా మీదకు ఉసిగొల్పుతున్నా నేను న్యాయం కోసం పోరాడుతున్నా అంటూ నవ్య చెప్పారు.

Bhargavi

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

20 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

20 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

2 days ago