General News

Trump : యుద్ధానికి బ్రేక్ వేసింది నేనే.. ఐ లవ్ పాకిస్థాన్! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

భారత్-పాకిస్థాన్ మధ్య గతంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధాన్ని తానే ఆపేశారని, ఈ సమస్యలో తాను కీలక పాత్ర పోషించినట్టు పేర్కొన్నారు.

“యుద్ధాన్ని నేను ఆపేశాను”
ఒక మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్, “భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు ఉన్న సమయంలో తానే జోక్యం చేసుకొని పరిస్థితిని నియంత్రించానని” తెలిపారు. “రెండు దేశాలూ అణ్వాయుధ శక్తులు కావడంతో, ఘర్షణ మరింత ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశముండేది. అందుకే నేను స్వయంగా వ్యవహరించాను,” అని వివరించారు.

“ఐ లవ్ పాకిస్థాన్”
పాకిస్థాన్‌పై తనకున్న ప్రేమను వ్యక్తపరుస్తూ, “ఐ లవ్ పాకిస్థాన్” అని ట్రంప్ అన్నారు. అంతేకాక, భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ, “మోదీ గొప్ప నాయకుడు. రాత్రి ఆయనతో ఫోన్‌లో మాట్లాడి ట్రేడ్ డీల్ గురించి చర్చించాను,” అని తెలిపారు.

భారత్, పాకిస్థాన్ నేతల పాత్రపై ట్రంప్ వ్యాఖ్యలు
యుద్ధాన్ని నివారించడంలో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్‌, భారత ప్రధాని మోదీ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాలను సమతుల్యంలో ఉంచేందుకు తనదైనదైన చర్యలు తీసుకున్నట్టు చెప్పారు.

మోదీ వ్యాఖ్యలతో వ్యతిరేకంగా?
ప్రధాని మోదీ గతంలో భారత్-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా జోక్యం లేదని పేర్కొనగా, ట్రంప్ వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. దీనిపై భారత విదేశాంగ మంత్రిత్వశాఖ స్పందిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.

telugudesk

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

1 day ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

1 day ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

1 day ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

1 day ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

1 day ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

1 day ago