Konda Surekha: వైయస్ కుటుంబ సభ్యులతో అనుబంధం లేదు.. కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్?
Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ మురళి దంపతుల జీవిత కథ ఆధారంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో కొండా అనే సినిమా తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా కొండ సురేఖ విజయవాడలో పర్యటించారు.
ఈ క్రమంలోనే కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కేవలం మా నిజ జీవితంలో ఏ విధమైనటువంటి ఒడిదుడుకులను ఎదుర్కొన్నాము. నిజజీవితంలో నక్సల్స్ ఉద్యమం, రాజకీయ ప్రయాణం మా ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిందని తెలిపారు.
కేవలం ఈ సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నానని, ఈ పర్యటనలో ఏ విధమైనటువంటి రాజకీయ ఉద్దేశ్యం లేదని తెలిపారు. ఇక ప్రస్తుతం తాము రాజకీయాల్లో కొనసాగుతున్నాము అంటే అది కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టిన భిక్ష అని మాత్రమే చెప్పాలి. ఆయనవల్లే రాజకీయాలలో ఎదిగామని తెలిపారు.
ఇక ప్రస్తుత రాజకీయాలలో విలువలు ఏమాత్రం లేదని ఆవేదన చెందారు. ప్రజల అభివృద్ధి కోసమే ప్రభుత్వాలు పని చేయాల్సి ఉంటుంది అయితే ప్రస్తుత రాజకీయాలలో ప్రజల అభివృద్ధి కరువైందని ఈమె ఆవేదన చెందారు. ఇక తనకు కేవలం వైయస్ రాజశేఖర్ రెడ్డి గారితో మాత్రమే అనుబంధం ఉందని ఆయన కుటుంబ సభ్యులతో పెద్ద అనుబంధం లేకపోవటం వల్లే వారిని కలవలేకపోయానని ఈమె తెలిపారు. ఇక పార్టీకి రాజీనామా చేసిన తర్వాత ఒక కేసు విషయంలో విజయమ్మ షర్మిలతో కలిసి కోర్టు వాయిదాలో మాత్రమే కలిశామని తెలిపారు.
భారతీయుల ఆహారపు అలవాట్లలో పెరుగుకు ప్రత్యేక స్థానం ఉంది. భోజనం చివరలో ఒక గిన్నె పెరుగు తింటే కడుపుకు హాయిగా…
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంపదకు, శుభానికి, భద్రమైన పెట్టుబడికి ప్రతీకగా భావించే…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటీమణుల్లో సమంత ఒకరు. తన నటన, కష్టపడి పనిచేసే తత్వం,…
ప్రపంచంలో కాఫీ ప్రియులు ఎన్నో రకాల కాఫీలను ఆస్వాదిస్తుంటారు. సాధారణ కాఫీ నుంచి ప్రత్యేక రకాల కాఫీల వరకు మార్కెట్లో…
పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…
జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…