Featured

Raviteja : టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ లో రవితేజకు ప్రమాదం… ఆందోళనలో మాస్ మహారాజ అభిమానులు…

Raviteja : మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీగా వున్నారు. ఖిలాడి సినిమా తరువాత ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా తీస్తున్నారు. ఒక స్టువర్టుపురం దొంగ కథ అదారంగా తెరకేక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాతో పాటు రవితేజ రామారావు ఆన్ ద్యూటీ, రావణాసుర, వంటి సినిమాలు చేస్తున్నారు. రవితేజ ఇంతకుముందు ఖిలాడీ సినిమాకు రైటర్ గా పని చేసిన శ్రీకాంత్ విస్సా దగ్గర నుంచి ఆయన దాదాపు అయిదు కథలను కొనుకున్నారు అని, అదికూడా సింగిల్ పేమెంట్ ఇచ్చి మరి అనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి కారణం దర్శకుడిని కూడా సెట్ చేసుకొని మరి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారట.

షూటింగులో ప్రమాదం జరిగిన తిరిగి వెంటనే…

ఇలా వరుస సినిమాలు కంప్లీట్ చేయాలని ఒక సినిమా షెడ్యూల్ గ్యాప్ లో మరో సినిమా షూటింగ్ చేస్తూ సినిమాలు పూర్తి చేసే ప్రయత్నంలో ప్రమాదానికి గురిఅయ్యాడు. తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం సమాచారం ప్రకారం రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ సమయంలో రోప్ స్కిడ్ కావడంతో రవితేజకు గాయాలు అయ్యాయని తెలుస్తోంది. దీంతో ఆయనకు కుట్లు కూడా పడ్డాయట. ఈ సంఘటన కారణంగా రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న ఆయన మళ్లీ షూటింగు ప్రారంభించారని తెలుస్తోంది.

తమ అభిమాన హీరోకి షూటింగ్ లో ప్రమాదం జరిగింది అనే విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. అయితే రవితేజ తాజాగా రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ కొడుకు పుట్టినరోజు వేడుకకు హాజరు అయ్యారు. కాగా ఆ సమయంలో ఆయనకు ఎలాంటి గాయాలు అయినట్లు కనిపించకపోవడం తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago