Raviteja : మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీగా వున్నారు. ఖిలాడి సినిమా తరువాత ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు సినిమా తీస్తున్నారు. ఒక స్టువర్టుపురం దొంగ కథ అదారంగా తెరకేక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాతో పాటు రవితేజ రామారావు ఆన్ ద్యూటీ, రావణాసుర, వంటి సినిమాలు చేస్తున్నారు. రవితేజ ఇంతకుముందు ఖిలాడీ సినిమాకు రైటర్ గా పని చేసిన శ్రీకాంత్ విస్సా దగ్గర నుంచి ఆయన దాదాపు అయిదు కథలను కొనుకున్నారు అని, అదికూడా సింగిల్ పేమెంట్ ఇచ్చి మరి అనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనికి కారణం దర్శకుడిని కూడా సెట్ చేసుకొని మరి ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారట.

షూటింగులో ప్రమాదం జరిగిన తిరిగి వెంటనే…
ఇలా వరుస సినిమాలు కంప్లీట్ చేయాలని ఒక సినిమా షెడ్యూల్ గ్యాప్ లో మరో సినిమా షూటింగ్ చేస్తూ సినిమాలు పూర్తి చేసే ప్రయత్నంలో ప్రమాదానికి గురిఅయ్యాడు. తాజాగా టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ప్రస్తుతం సమాచారం ప్రకారం రెండు రోజుల క్రితం ఈ సినిమా షూటింగ్ సమయంలో రోప్ స్కిడ్ కావడంతో రవితేజకు గాయాలు అయ్యాయని తెలుస్తోంది. దీంతో ఆయనకు కుట్లు కూడా పడ్డాయట. ఈ సంఘటన కారణంగా రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న ఆయన మళ్లీ షూటింగు ప్రారంభించారని తెలుస్తోంది.

తమ అభిమాన హీరోకి షూటింగ్ లో ప్రమాదం జరిగింది అనే విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు కాస్త కంగారు పడుతున్నారు. అయితే రవితేజ తాజాగా రైటర్ ప్రసన్నకుమార్ బెజవాడ కొడుకు పుట్టినరోజు వేడుకకు హాజరు అయ్యారు. కాగా ఆ సమయంలో ఆయనకు ఎలాంటి గాయాలు అయినట్లు కనిపించకపోవడం తో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

































