Featured

Sai Pallavi : ముదురుతున్న వివాదం… సాయి పల్లవి పై కేసు పెట్టిన భజరంగ్ దళ్ నాయకులు… గో రక్షకుడిని కాశ్మీర్ ఉగ్రవాదితో పోల్చిందని ఆరోపణ… క్షమాపణకు డిమాండ్…!

Sai Pallavi : అ మాత్రం నెగెటివిటీ లేకుండా వివాదాలు లేకుండా కనీసం తనపై లవ్ రూమర్స్ కూడా లేకుండా కెరీర్ లో క్లీన్ వైట్ పేపర్ లా ఉన్న సాయి పల్లవి ప్రస్తుతం ఒక వివాదంలో ఇరుక్కుంది. విరాట పర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతున్న సాయి పల్లవి మతం గురించి చేసిన వాఖ్యలపై కొంతమంది విరుచుకుపడుతున్నారు. సాయి పల్లవి ని సోషల్ మీడియా వేదికగా ఒక వర్గం వారు బాగా ట్రోల్ చేస్తున్నారు. క్షమాపణలను చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

సాయి పల్లవి పై కేసు పెట్టిన భజరంగ్ దళ్ నాయకులు…

సాయి పల్లవి విరాట పర్వం సినిమా ప్రచార కార్యక్రమాల్లో మాట్లాడుతూ.. ఎవరు తప్పు, ఒప్పు అని చెప్పలేము, కొన్ని రోజుల ముందు ‘ది కశ్మీర్ ఫైల్స్’ అనే సినిమా వచ్చింది కదా? .. ఆ సినిమాలో ఒకప్పుడు కశ్మీరీ పండిట్లను ఎలా చంపారో చూపించారు కదా… వాటిని మనం మత ఘర్షణలా చూస్తే.. తాజాగా ఓ బండిలో ఎవరో ఆవులని తీసుకెళ్తున్నారు. ఆ బండిని నడుపుతున్న వ్యక్తి ముస్లింలాగా ఉన్నాడు వాటిని చూసి కొంత మంది అతన్ని కొట్టి జై శ్రీరామ్ అన్నారు. అప్పుడు జరిగిన దానికి ఇప్పుడు జరిగినదానికి తేడా ఎక్కడ వుంది.. మతాలు కాదు మనం మంచి వ్యక్తిగా వుంటే ఇతరులను బాధించం. లెఫ్టిస్ట్ అయినా రైటిస్ట్ అయినా మనం కరెక్ట్ గా వుండకపోతే న్యాయం ఎక్కడా ఉండదు” అని చెప్పుకొచ్చింది.

ఇపుడు ఈ వాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఏకంగా భజరంగ్ దళ్ నాయకులు పోలీస్ కేసు పెట్టే వరకు వెళ్ళింది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లో సాయి పల్లవి పై కేసు పెట్టారు భజరంగ్ దళ్ వారు. గో సంరక్షకులను కాశ్మీరి తీవ్రవాదులతో సాయి పల్లవి పోల్చిందని అది మా మనోభావాలను దెబ్బతీసిందని వెంటనే తన మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో పరిశీలించి న్యాయ సలహా తీసుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago