Kamal Kamaraju : శేఖర్ ఖమ్ముల గోదావరి సినిమాతో కమల్ కామరాజు, ఆ తరువాత అవకాయ్ బిర్యాని సినిమాతో హీరోగా మారాడు. ఆ తరువాత కలవరమాయే నా మదిలో సినిమాలో స్వాతితో నటించాడు. ఇక పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన కమల్ కామరాజు తాజాగా నాట్యం సినిమాలో నటించాడు. ఇక తన మొదటి సినిమా నుండి ఇప్పటివరకు తన జ్ఞాపకాలను ఇంటర్వ్యూల్లో చెప్పారు.
బిందు మాధవి సెట్స్ లో అలా ఉంటుంది…..
అవకాయ్ బిర్యాని సినిమాలో కమల్ కామరాజు హీరోగా నటించారు. ఆ సినిమాలో తనకు జోడిగా నటించిన హీరోయిన్ బిందు మాధవి గురించి స్పందించారు. రీసెంట్ గా బిందు మాధవి బిగ్ బాస్ మొదటి మహిళ విన్నర్ గా నిలిచింది. ఇక తనతో వర్క్ చేయడం గురించి అడుగగా బిందు చాలా ఇండిపెండెంట్ వుమన్ అని చాలా స్ట్రాంగ్ అమ్మాయి అంటూ కితాబు ఇచ్చారు. ఇక నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటుందని కష్టపడే మనస్తత్వమంటూ పొగిడారు. ఈ మధ్య కాలంలో చూడాలనిపించేలా ఏ సినిమా లేదని అభిప్రాయపడ్డారు. టికెట్ కొనుక్కుని, సమయాన్ని వెచ్చించి చూడదగ్గ సినిమాలేవి రావడంలేదని అభిప్రాయపడ్డారు. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2 సినిమాలు నచ్చాయని చాలా బాగున్నాయని అన్నారు.
మహేష్ తో మహర్షి సినిమా టైములో ఆయన పర్ఫెక్షన్ చూసి ఆశ్చర్యపోయాను అంటూ పొగిడారు. నాట్యం సినిమాలాంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించలేక పోతున్నారు. అలాంటి ఆర్ట్ సినిమాలను జనం ఇష్టపడటం లేదు అంటూ వాఖ్యణించారు. నచ్చిన పాత్రలనే చేస్తా ఒకవేళ రాకపోతే ఆర్చిటెక్ట్ గా నా పని చేసుకుంటా అంటూ చెప్పారు. రాజమౌళి, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకుల సినిమా ఎంత ఎక్సయిట్మెంట్ తో చూస్తామో వాళ్ళు పని చేసేటపుడు చూడాలన్నా నాకు అంతే ఎక్సయిట్మెంట్ ఉంటుందని చెప్పారు. ఇక రాధే శ్యామ్ సినిమా సమయంలో ప్రభాస్ నన్ను చూసి పిలిచి ఆయనే పలకరించారు. అలా అంత పెద్ద స్టార్ అయినా అలా సొంత మనిషిలా మాట్లాడటం చాలా నచ్చింది ప్రభాస్ నిజంగా డార్లింగ్ అంటూ పొగిడాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…