Featured

Jayaprada: జీవితంలో చేసిన ఆ చిన్న తప్పు వల్ల ఆంధ్రానే వదిలేయాల్సి వచ్చింది.. జయప్రద సెన్సేషనల్ కామెంట్స్!

Jayaprada: సీనియర్ నటిగా, మాజీ రాజ్యసభ సభ్యురాలిగా ఒకవైపు సినిమాలలోను మరోవైపు రాజకీయాల్లో కొనసాగుతూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకున్న నటి జయప్రద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె తెలుగులో సినిమాలలో చేయక పోయినప్పటికీ ఇతర భాషా చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఇకపోతే జయప్రద ప్రస్తుతం బీజేపీ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

Jayaprada: జీవితంలో చేసిన ఆ చిన్న తప్పు వల్ల ఆంధ్రానే వదిలేయాల్సి వచ్చింది.. జయప్రద సెన్సేషనల్ కామెంట్స్!

తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న జయప్రద తన సినీ కెరీర్ గురించి సీనియర్ ఎన్టీఆర్ గారితో తనకున్న అనుబంధం గురించి తెలియజేశారు. ఎన్టీఆర్ గారు తన జీవితంలో ఒక రోల్ మోడల్ అని తెలిపారు.తనని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగానని అతని స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చి అతని నుంచి ఎన్నో గొప్ప విషయాలు నేర్చుకున్నానని ఈమె తెలిపారు.

Jayaprada: జీవితంలో చేసిన ఆ చిన్న తప్పు వల్ల ఆంధ్రానే వదిలేయాల్సి వచ్చింది.. జయప్రద సెన్సేషనల్ కామెంట్స్!

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు పార్టీలో చేరమని ఎన్టీఆర్ ఫోన్ చేసిన వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా తాను తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశానని, ఎలాంటి పదవులు ఆశించి తాను తెలుగుదేశం పార్టీలో చేరలేదని కేవలం ఎన్టీఆర్ గారిని సీఎంగా చూడాలన్నదే తన లక్ష్యమని జయప్రద తెలియజేశారు.

అయితే ఇలా రాజకీయాల్లో కొనసాగుతున్న సమయంలో చంద్రబాబు తెలుగుదేశం పార్టీని తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత ఎన్టీఆర్ గారిని వదిలి ఇతర ఎమ్మెల్యేలు బలవంతం మీద ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం మేము చంద్రబాబుతో ఏకీభవిస్తున్నామని చెప్పడంతో నేను ఎన్టీఆర్ గారిని వదిలి చంద్రబాబుకు మద్దతు తెలిపాను. అదే తన జీవితంలో చేసిన పెద్ద తప్పు అంటూ ఈ సందర్భంగా ఆమె ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్నారు.ఎన్టీఆర్ గారు నా పై ఎంతో విశ్వాసం ఉంచి తనని పార్టీలోకి ఆహ్వానించగా నేను ఎన్టీఆర్ గారి దగ్గర ఉండాల్సిన సమయంలో ఉండకుండా బయటకు వచ్చానని ఈ సందర్భంగా జయప్రద వెల్లడించారు.

విలువ ఇవ్వలేదు…

ఇకపోతే చంద్రబాబునాయుడు సీఎం అయిన తర్వాత తాను రాజ్యసభ సభ్యురాలిగా పదవిలో ఉన్నానని ఆయన సీఎం అయిన తర్వాత ప్రజలకు విలువ ఇవ్వడం అలాగే పార్టీ నేతలతో ప్రవర్తించే తీరులో పెద్ద ఎత్తున మార్పులు వచ్చాయి.పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవ్వాల్సిన గుర్తింపు గౌరవం ఇవ్వకపోవడంతో నేను ఆంధ్ర వదిలి రావాల్సి వచ్చిందని ఈ సందర్భంగా జయప్రద వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago