Ester Noronha: నటిగా, సింగర్ నోయల్ మాజీ భార్య గా పలు సినిమాలలో నటించి గుర్తింపు సంపాదించుకున్న నటి ఎస్తర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె పలు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా గుర్తింపు పొందారు.అయితే సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంటుంది అనే సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఎస్తర్ కి క్యాస్టింగ్ కౌచ్ గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు కూడా క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారా అంటూ ప్రశ్నించగా ఈమె షాకింగ్ కామెంట్ చేశారు. తనకి కూడా ఇండస్ట్రీలో వచ్చిన మొదట్లో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.
తన దగ్గరికి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు నేరుగా వచ్చి అడగలేదని ఇండైరెక్ట్ గా మేనేజర్లను పంపించి మీరు కొంచెం పద్ధతిగా ఆడపిల్ల లాగా ప్రవర్తించండి, కాస్త ఫ్రెండ్లీగా మూవ్ అండి, కెరీర్ బాగుంటుంది చూడండి అంటూ తనకు క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురయ్యాయని ఈమె తెలిపారు.
అయితే మనం అవకాశాల కోసం ఇలాంటి వాటికి ఒప్పుకుంటే మనం ఎంతో మందిని మోసం చేసినట్లేనని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.మనం చిన్నప్పటి నుంచి మనల్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు అలాగే మనకు సినిమా ట్రైనింగ్ ఇచ్చిన గురువులను కూడా మనం మోసం చేసినట్లేనని ఈ సందర్భంగా ఈమె తెలిపారు. ఒకసారి మనం ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత నటిగా మనం గుర్తింపు పొందినట్లే, మనలో టాలెంట్ చూసి అవకాశాలు వాటంతట అవే వస్తాయి కానీ ఇలా అవకాశాల కోసం కమిట్మెంట్ ఇవ్వకూడదని ఈమె వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…