Comedian Ali : అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఎఫ్2 సినిమా ఎంతటి వినోదం పంచిందో తెలిసిందే. అయితే తాజాగా ఎఫ్ 2 సినిమాకి సీక్వెల్ గా మే 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఎఫ్3. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఎఫ్3 కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా విజయాన్ని పురస్కరించుకొని సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా వెంకటేష్ మాట్లాడుతూ…..‘‘ఎఫ్3’ సినిమా తెలుగు ప్రేక్షకులందరిని ఆకట్టుకున్నందుకు సంతోషంగా ఉంది. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నాను . ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరు సినిమా చూడటానికి వస్తున్నారు’’ అని చెప్పారు.
ఇక హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ….” ఎలాంటి ఫ్రస్ట్రేషన్ లేకుండా ఈ సినిమాని తీశారు దర్శకుడు అనిల్ రావిపూడి. పిల్లలు కూడా థియేటర్‌లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు’’ అని చెప్పారు. 45 ఏళ్లగా సినిమాలు చేస్తున్నాను, ఈ సినిమా చూసాక చాలా మంది అభినందించారు. ఈ సినిమా చేసాక నా సినిమాలలో మాయలోడు సినిమా గుర్తొచ్చింది అని రాజేంద్రప్రసాద్ తన సంతోషాన్ని తెలియజేసారు. అఖండ, పుష్ప, ఆర్ఆర్ఆర్, భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సినిమాల తరువాత ఎఫ్3 సినిమాకు ప్రేక్షకులు థియేటర్ వద్దకు వచ్చారు, అని అనిల్ రావిపూడి అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసారు.
అలీ ఆసక్తికర వ్యాఖ్యలు…..
ఇక ఎఫ్3 సినిమా గురించి మొదటి నుంచి సినిమా బాగోలేదు అన్న ప్రచారం జరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్3 సక్సెస్ మీట్ లో పాల్గొన్న కమెడియన్ అలీ దీనిపై స్పందించారు. సినిమా హిట్టయిన కూడా కొందరు బాగాలేదని పనికట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. సినిమా బాగుంది అంటే ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారు అనే విషయానికి ‘ఎఫ్ 3’ సినిమా విజయం ఒక నిదర్శనం’’ అని అలీ తెలిపారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్‌లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్‌తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…