Chiranjeevi: వాళ్లు ఎదగాలనే నేను తగ్గాను.. చిరు షాకింగ్ కామెంట్స్!
Chiranjeevi:మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను 23వ తేదీ ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ మాట్లాడుతూ తన అసలు పేరు శివశంకర వరప్రసాద్ అని అందరికీ గుర్తు చేశారు.
శివశంకర వరప్రసాద్ శివుడు నృత్యానికి ప్రసిద్ధి, ఆ శివుడి ముందు ఎవరైనా డాన్స్ చేయగలరా… చాలామంది తాము డాన్స్ చేస్తున్నామని అనుకుంటారు అయితే అదంతా శివుడి తర్వాతే అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.అప్పుడప్పుడు ఇతర హీరోలను కూడా ప్రోత్సహించాలి కనుక వాళ్లు ఎదగడం కోసమే తాను తగ్గుతున్నానని మెగాస్టార్ వెల్లడించారు.
ఈ సందర్భంగా చిరంజీవి డ్యాన్స్ విషయంలో తానే కింగ్ అంటూ పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఈయన నటించిన ఆచార్య సినిమా 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో మెగా స్టార్ మెగా పవర్ స్టార్ కలిసి నటించడంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
సరికొత్త కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా సందడి చేస్తుందో తెలియాల్సి ఉంది. ఇలా ఓకే తెరపై తండ్రి కొడుకులను చూడటం కోసం ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించగా, రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్నారు. రామ్ చరణ్ సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…