Samantha – Rashmika: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర తారగా పేరు సంపాదించుకున్న వారిలో సమంత, రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ అద్భుతమైన నటన, అందంతో వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు.ఈ క్రమంలోనే సమంత గురించి ఎన్నో నెగిటివ్ కామెంట్లు వచ్చినప్పటికీ ఎంతో సహనంగా భరించారు.
అయితే తాజాగా తన పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో సమంత ట్విట్టర్ ద్వారా ట్రోలర్స్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నా నిశ్శబ్దాన్ని తెలియనితనం గా… నా మౌనాన్ని అంగీకారంగా, నా దయ నా బలహీనంగా చూడకండి…బలహీనతకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు.
సమంత ట్వీట్ చేయడంతో ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసింది అంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. ఈ క్రమంలోనే సమంత చేసిన ట్వీట్ నేషనల్ క్రష్ రష్మిక స్పందించి పవర్ వర్డ్ అంటూ అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే Word అని రాసి పక్కన పవర్ అనే ఏమోజినీ షేర్ చేశారు.ఈ క్రమంలోనే రష్మిక చేసిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ ట్వీట్ పై నెటిజన్స్ స్పందిస్తూ ఇద్దరూ ఒకరికొకరు బాగా సపోర్ట్ చేసుకుంటున్నారు. వినేవాడు ఉంటే ఎన్నయినా చెప్తారు. పాపం చైతూ, రక్షిత్ ఇద్దరినీ పిచ్చోళ్లను చేసి ఆడుకున్నారు అంటూ నెటిజన్లు వీరి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే మరొక నటించిన స్పందిస్తూ ఆ ఇద్దరికీ అన్యాయం చేసి ఇప్పుడు మాటలు బాగా మాట్లాడుతున్నారు అంటూ కామెంట్ చేశారు. మొత్తానికి ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…