MS Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, దేవి పుత్రుడు వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయ్యాయి.సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ప్రముఖ నిర్మాత ఎమ్మెస్ రాజు ఈ చిత్రాలను నిర్మించి ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు. తాజాగా ఈయన ప్రొడక్షన్ బ్యానర్ లో, ఆయనే దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం 7 డేస్ 6 నైట్స్ .
ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఒక మీడియాతో ముచ్చటించిన ఎమ్మెస్ రాజు ఇండస్ట్రీలో అగ్ర హీరోల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను స్టార్ హీరోలను ఏమాత్రం నమ్మనని కథను మాత్రమే నమ్ముతానని తెలిపారు. గతంలో రవితేజ, మహేష్, త్రివిక్రమ్, గుణశేఖర్ వంటి సెలబ్రిటీలు నాతో కలిసి సినిమా చేద్దాం అని అడిగారు.
ఈ విధంగా సినిమా చేయమని అడిగితే నిర్మొహమాటంగా చేయనని సమాధానం చెప్పానని ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు వెల్లడించారు. ఒట్టేసి చెబుతున్నా… ప్రభాస్,మహేష్ బాబు వంటి అగ్ర హీరోలు నాతో సినిమా చేస్తామని డేట్స్ ఇచ్చిన కూడా నేను వారితో సినిమా చేయను. కేవలం స్టార్ హీరోలని నమ్ముకుని నేను సినిమా చేయనని కథకు ప్రాధాన్యత ఇచ్చి కథ బాగుంటేనే సినిమా చేస్తానని తెలిపారు.
నిజం చెప్పాలంటే తాను అగ్రహీరోలతో చేసిన సినిమాలకన్నా కథను నమ్ముకుని చేసిన మనసంతా నువ్వే సినిమాతో తనకు ఎక్కువగా లాభాలు వచ్చాయని,ఇలా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలు నాకు నచ్చిన సినిమాలను మాత్రమే నేను చేస్తాను తప్ప హీరోలని చూసి సినిమా చేయనని ఈ సందర్భంగా ఎమ్మెస్ రాజు వెల్లడించారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…