Praneetha Subhash : ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో ఎంట్రీ ఇచ్చి బావ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కన్నడ ముద్దుగుమ్మ ప్రణీత. ఆ తరువాత కన్నడ తమిళ భాషలలో కూడా నటించింది. అత్తారింటికి దారేది, రభస, బ్రహ్మోత్సవం వంటి పెద్ద హీరోల సినిమాల్లో నటించినా టాప్ హీరోయిన్ పొజిషన్ కి మాత్రం రాలేకపోయింది ఈ ముద్దు గుమ్మ. ఇక లాక్ డౌన్ లో పెళ్లి చేసేసుకుంది. బెంగళూరుకి చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని వివాహం చేసుకుంది.
పండంటి పాపకి జన్మనిచ్చిన ప్రణీత….
వివాహం తరువాత ప్రణీత సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇక ప్రణీత తాను తల్లి కాబోతున్న విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంది. తన భర్తను హాగ్ చేసుకుని తన ప్రెగ్నెన్సీ స్కానింగ్ రిపోర్ట్ చూపిస్తూ తన భర్త పుట్టినరోజు నాడు తన భర్త 34 పుట్టినరోజు గిఫ్ట్ అంటూ తీసుకున్న ఫోటోలను షేర్ చేసింది. ఇక అప్పటి నుండి ప్రెగ్నెన్సీ పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫిట్ నెస్ కి సంబంధించిన వీడియోలతో సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న ప్రణీత సంప్రదాయం ప్రకారం శ్రీమంతం వేడుక కూడా జరుపుకుంది.
ఇక జూన్ 10 శుక్రవారం నాడు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకుంది పొత్తిళ్లలో తన బిడ్డతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ ఇదంతా కలలా ఉంది గైనకాలజిస్ట్ అమ్మను కలిగి ఉండటం నా అదృష్టం, కానీ ఆమెకు ఇది మానసికంగా కష్టతరమైన సమయం. అదృష్టవశాత్తూ డాక్టర్ సునీల్ ఈశ్వర్ మరియు అతని బృందం అస్తేర్ ఆర్వీ వద్ద డెలివరీ సాఫీగా జరిగేలా చేసారు. అలాగే ఈ ప్రక్రియ సాధ్యమైనంత తక్కువ బాధాకరంగా ఉండేలా చేసిన అనస్తీషియ డాక్టర్ సుబ్బు, మరియు అతని బృందానికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను అంటూ రాసిన ప్రణీత ఇదంతా అభిమానులతో పంచుకోకుండా ఉండలేను అంటూ పోస్ట్ చేసింది.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…