Varsha & Immanuel : జబర్దస్త్ వేదికపై ఎంతో మంది కమెడియన్స్ గా గుర్తింపు తెచ్చుకుని తమ కెరీర్ ను మలుచుకున్నారు. ఇక జబర్దస్త్ లో కొత్త వాళ్లకు ఎప్పుడు అవకాశాలు ఇస్తూనే ఉంటారు. యూట్యూబ్ లో ఫేమస్ అయిన కామన్ వాళ్ళు కూడా జబర్దస్త్ లో కనిపిస్తుంటారు. ఇక లేడీ గెటప్ లతో పాటు అమ్మాయిలు కూడా జబర్దస్త్ లో వస్తున్నారు. అలా వచ్చిన వారిలో వర్ష, రోహిణి బాగా ఫేమస్ అయ్యారు. ఇక వర్ష అయితే ఇమ్మానుయేల్ కి జోడిగా బాగా ఫేమస్ అయింది.
మా ఇద్దరి బంధం స్పెషల్……
జబర్దస్త్ లో హిట్ పెయిర్ అనగానే సుధీర్, రశ్మి జంట గుర్తొస్తారు. వారి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. రెండు మూడు సార్లు పెళ్లి తంతు కూడా చేసి ఆ పెయిర్ కి మరింత హైపర్ ఇచ్చారు మల్లెమాల వాళ్ళు. నిజంగా వాళ్లిదరి మధ్య ఏదో ఉంది అనేంతలా ఆ జంట క్లిక్ అయింది. చాలా మంది అభిమానులు సుధీర్, రష్మీ పెళ్లి చేసుకోవాలని బాగా కోరుకుంటున్నారు. ఇక వీరి తరువాత అలా పేరు తెచ్చుకున్న జంట వర్ష, ఇమ్మానుయేల్ ది. ఈ ఇద్దరి జంటను జబర్దస్త్ బాగా ప్రమోట్ చేసింది. రొమాంటిక్ పాటలకు డాన్స్ చేయడం, ఇక వీళ్ళిద్దరికి పెళ్లి చేయడం ఇలాంటివన్నీ వీళ్లిద్దరి మధ్య ఏదో ఉంది అనేలా చేసాయి.
ఇక ఈ విషయం గురించి వర్షకు ప్రశ్న ఎదురవ్వగా మా మధ్య ఉన్నది స్నేహం అని చెప్పలేను, మా మధ్య ఉన్న బంధం ఇది అని ఖచ్చితంగా చెప్పలేను. మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ కేవలం జబర్దస్త్ స్కిట్లతోనే అయిపోదు ఆ తరువాత కూడా కొనసాగుతుంది. ఇమ్మూ అంటే నాకు అభిమానం, అలాగే ఇమ్మూ కి కూడా నేనంటే అభిమానం. భవిష్యత్తులో ఈ బంధం ఎలా ఉండబోతోందో, ఎలా మారుతుందో ఇపుడే చెప్పలేం అంటూనే కేవలం టీ ఆర్పి కోసమే ప్రతిసారి చేయమని అంత ఒక కుంటుంబంలాగా జబర్దస్త్ లో ఉంటామని ఒకరికి కష్టమొచ్చినా అందరం బాధపడతామని, స్టేజి పైన ఎమోషన్స్ కేవలం షో కోసం కాదని కొన్నిసార్లు అవి నిజంగా వచ్చేవి అంటూ ఇమ్మూ పై బంధం గురించి చెప్పి చెప్పనట్టుగా చెప్పేసింది వర్ష.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…