Sai Pallavi : మలయాళం లో ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో శేఖర్ ఖమ్ముల ‘ఫిదా’ చిత్రం తో మరింత క్రేజ్ సంపాదించుకుంది. చాలా సెలెక్టివ్ గా కంగారేమి లేనట్టుగా తనకు నచ్చిన పాత్రలానే ఎంచుకునే సాయి పల్లవి ఇపుడు తెలుగు వారికి నచ్చిన అమ్మాయి. సినిమాల్లో తాను కనిపిస్తే ఒక ఎమోషనల్ లా ఫీల్ అవుతున్నారు ఆడియన్స్. తన నటన తోనే కాదు తన వ్యక్తిత్వంతో కూడా అందరి అభిమానం సొంతం చేసుకున్న సాయి పల్లవి తన అందం, అభినయం, డాన్స్ తో సినిమాల్లో హీరోలకు గట్టిపోటి ఇస్తోంది.
చాక్లెట్ అంటే చాలా ఇష్టం….
తాజాగా సాయి పల్లవి నటించిన చిత్రం విరాట పర్వం. రానా, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా వేణు ఉడుముల దర్శకుడు. నక్సలైట్ నేపథ్యంలో సాగే ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాలు పడుతూ వచ్చింది. ఇపుడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సాయి పల్లవి తాజాగా ప్రముఖ న్యూస్ ఛానల్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లో ప్రసారమయ్యే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో పాల్గొంది. రాధా కృష్ణ సాధారణంగా చేసే ఇంటర్వ్యూ లకు భిన్నంగా ఈ ఇంటర్వ్యూ సాగింది. ఇక తెలుగు అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అని ఆర్కే అడుగగా మా నాన్న కూడా అలానే అంటారంటూ నవ్వింది.
తనకు కంఫర్ట్ లేకపోతే సినిమాలో చేయలేనని, సినిమాల్లో అవకాశలు లేకపోతే వెళ్లి చదువుకుని ఉద్యోగం చేయగలనన్న నమ్మకం ఉందని అందుకే సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నానని చెప్పింది. పల్లవి కి చాక్లెట్స్ అంటే ఇష్టమని తెలిసి ఆర్కే ఆమెకు చాక్లెట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేసారు. ఇక పెళ్లి ప్రస్తావన వచ్చినపుడు 23 ఏళ్లకు పెళ్లి చేసుకుని 30 ఏళ్ల లోపు పిల్లలతో ఉంటానని అనుకునేదాన్నని చెప్పి ఆశ్చర్య పరిచింది. ఇక చాలా సరదాగా సాగిన వీరి సంభాషణలో ఆర్కే గ్లామర్ ప్రపంచంలో ఇంత పద్దతిగా ఉంటూ కూడా సక్సెస్ అవ్వచ్చనడానికి నువ్వు ఉదాహరణ అంటూ కితాబు ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…