ముదురు, లేత మటన్ ను ఎలా గుర్తించాలంటే..ఈ చిట్కాలు పాటించాల్సిందే..!

కరోనా సమయంలో చాలామంది రోగ నిరోధకశక్తి పెంచుకోవడానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తున్నారు. ఇందులో కొంతమంది నాన్ వెజ్ తినని వారు డ్రై ఫ్రూట్స్ తింటూ వాళ్ల ఇమ్యూనిటీని పెంచుకుంటుంటే.. మరి కొందరు చికెన్, మటన్ తింటూ పెంచుకుంటున్నారు. అయితే చాలామంది మటన్ షాప్ కు వెళ్లినప్పుడు కిలో లేదు రెండు కిలోల మటన్ చెప్పి.. వాడు ఇచ్చింది తెచ్చుకుంటాం..కానీ కొంతమంది ఆ మటన్ ముదురుదా..లేతదా అనేది ఆరా తీస్తారు.

ముదురుది, లేత అనేది ఎలా గుర్తు పట్టాలి.. వాటి కోసం ఏం చేయాలి ఇక్కడ తెలుసుకుందాం.. చికెన్ కంటే కూడా మటన్ తినడం చాలామంచింది. ఎందుకంటే.. అందులో ముఖ్యంగా విట‌మిన్ బి12 మ‌ట‌న్ ద్వారా ఎక్కువ‌గా ల‌భిస్తుంది. ముఖ్యంగా దుకాణాల్లో మనకు కనిపించే మటన్ అనేది లేత మటన్ అయితే.. లేత ఎరుపు రంగులో కనిపిస్తుంటుంది. అది ఒక వేళ ముదురు మటన్ అయితే మాత్రం డార్క్ రెడ్ లో కనిపిస్తుంది.

మటన్ పై కొవ్వు అనేది ప‌సుపు లేదా బూడిద రంగులో ఉంటే మాత్రం అది ముదురు మటన్ అని.. కొవ్వు తెల్ల‌గా, లేత‌ ప‌సుపు రంగులో ఉంటే అది లేత మటన్ అని మనం గుర్తించవచ్చు. లేత మటన్ నుంచి ఆ కొవ్వును సులువుగా తొలగించవచ్చు. ముదురు మటన్ నుంచి ఆ కొవ్వను తొలగించాలంటే సలుభంగా వేరు చేయలేము. అది చాలా గ‌ట్టిగా ఉంటుంది.

లేత మటన్ అనేది వాసన వస్తూ ఉంటుంది.. ముదురు మటన్ వాసన రాదు. సులభంగా గుర్తించే మరి కొన్ని చిట్కాలు ఏంటంటే.. మటన్ పై వేలితో నొక్కితే సొట్టలు పడతాయి.. ఇలా ఏర్పడితే అది ముదురు మటన్ అని అర్ధం. పక్కటెముకలు చిన్నగా ఉంటే లేత మటన్ అని.. పెద్దగా ఉంటే ముదురు మటన్ అని గుర్తుంచుకోవచ్చు. అంన్నింటి కంటే మరో చిన్న చిట్కా ఏంటంటే.. తోక చిన్నగా ఉంటే లేతది అని.. పెద్ద‌గా ఉంటే ముదురు మ‌ట‌న్ అని తెలుసుకోవచ్చు. ఇలాంటివి ఫాలో అయి లేత లేదా ముదురు మటన్ ను గుర్తించవచ్చు.