POLITICAL NEWS: యోగీకి ఓటేయకుంటే… యూపీ నుంచి పారిపోండి: రాజా సింగ్ వార్నింగ్
POLITICAL NEWS: ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మరోసారి సంచలన వ్యాక్యలు చేశారు ఈసారి యూపీ ఎన్నికలు, యోగీ ఆదిత్య నాథ్ పై వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఏడుదశల్లో యూపీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రెండు దశల ఎన్నికలు జరిగాయి. యూపీలో బీజేపీ, ఎస్పీ ల మధ్య తీవ్ర పోటీ ఉంది. రెండు పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇరు పార్టీ రాజకీయ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.
ఇప్పటికే పలు ఒపీనియన్ పోల్స్ ప్రకారం సీట్లు తగ్గినా బీజేపీ అధికారంలోకి వస్తుందంటూ.. జోస్యం చెబుతున్నాయి. అయితే ఎన్డీయేతర విపక్షాల మాత్రం ఎస్పీ అధికారంలోకి వస్తుందని, అఖిలేష్ సీఎం అవుతాడంటూ.. ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. ఎమ్మెల్యే రాజా సింగ్ యూపీ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చాడు. యూపీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయకుంటే… యూపీ వదిలి వెళ్లాలని వార్నింగ్ ఇచ్చారు. యోగికి ఓటు వేయకుంటే.. జేసీబీలు, బుల్డోజర్లు పంపిస్తాం అంటూ హెచ్చరించారు. యోగికి ఓటు వేయని ఏరియాలను గుర్తిస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. యూపీలో ఉండాలంటే యోగీ అనాల్సిందే అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్ ప్రదేశ్ లో యోగీ బాబా ప్రభుత్వం వస్తుందని రాజా సింగ్ అన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…