భూమిపై నివసించే ప్రతి ప్రాణికి గూడు అనేది తప్పనిసరి. చిన్న జీవి నుంచి మనిషి వరకు ఇల్లు అనేది ముఖ్యమైన అంశం. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు వారి స్థోమతకు తగ్గట్టుగా ఇంటి నిర్మాణం చేపడతారు. ఈ క్రమంలోనే పక్షులకు కూడా వాటికి ఇల్లు కావాలని, అవి గుడ్లు పెట్టే సమయానికి గూడు నిర్మించుకునే పనిలో నిమగ్నం అవుతాయి.
సాధారణంగా పక్షులు చెట్ల నుంచి వివిధ రకాల పుల్లలు, గడ్డిని సేకరించి ఎంతో అందంగా గూడును నిర్మించడం మనం చూస్తూనే ఉంటాం. అయితే పక్షులు ఈ విధమైనటువంటి పుల్లలు, గడ్డి తీసుకెళ్లాలంటే నోటి సహాయంతో తీసుకెళ్లడం మనం చూస్తుంటాము.కానీ లవ్ బర్డ్ అనే ఒక పక్షి మాత్రం అన్ని పక్షులకు ఎంతో భిన్నంగా తన తెలివితేటలను ప్రదర్శించింది.
లవ్ బర్డ్ అనే పక్షి ఇంటి నిర్మాణం కోసం ఒక చెట్టు పై కూర్చుని ఆకుకు మధ్యలో ఉన్న ఈనెను ఎంతో తెలివిగా కత్తిరించి నోటిద్వారా తీసుకెళ్లకుండా,అంత దూరం ఓకే పుల్లను తీసుకెళ్ళి రావాలంటే ఎంతో శ్రమతో కూడుకున్నది కనుక ఈ పక్షి తన తెలివిని ఉపయోగించి ఈనెలన్నింటిని తన ఈకలలో దాచుకుంది.ఈ విధంగా ఈ బర్డ్ చేసిన పనికి సంబంధించిన వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నంద సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు ఈ పక్షి తెలివి తేటల పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…