మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు త్వరలో జరగబోతున్న నేపద్యంలో చిత్ర పరిశ్రమలో ఎన్నికల హడావిడి మొదలైపోయింది. ఈ ఎన్నికలు సెప్టెంబర్‌లో జరగాల్సి ఉండగా.. 3 నెలల ముందే పరిశ్రమలో వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ఈ ఎన్నికల్లో అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్లు సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్, హీరో మంచు విష్ణు, నటి జీవితా రాజశేఖర్, నటి హేమ ప్రకటించారు.
అదలా ఉంటే.. నందమూరి కళ్యాణ్ రామ్ ‘మా’ ఎన్నికల్లో నిలబడతారంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది. ప్రముఖ చానళ్లతో పాటూ, సోషల్ మీడియాలో కూడా ఈ ప్రచారం ఊపందుకుంది. అయితే అటువంటిది ఏమి లేదని మీడియాలో జరుగుతున్న ప్రచారం అంతా నమ్మవద్దని నడమూరి కళ్యాన్ రామ్ అధికార ప్రతినిధి ఫుల్ స్టాప్ పెట్టారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని నందమూరి కళ్యాణ్ రామ్ ‘మా’ ఎన్నికల్లో నిలబడటం లేదని స్పష్టం చేశారు.
కాగా.. మా ఎన్నికల్లో మొదటి నుంచీ చురుకైన పాత్ర పోషిస్తున్న సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ తాజగా తన ప్యానల్ సభ్యుల వివరాలను ప్రకటించారు. మొత్తం 27మందితో ఈ జాబితాను విడుదల చేశారు. అయితే ఇందులో ఎవరు ఏ పదవికి పోటీ చేస్తారో మాత్రం ఆయన చెప్పలేదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…